Big Stories

Kiran Kumar Reddy Comments: సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం

Nallari Kiran Kumar Reddy Comments: ఏపీలో పార్లమెంటు ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇటు వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. మొత్తం ఇక్కడ పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతోంది.

- Advertisement -

ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ తాము చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని, గతంలో అభివృద్ధి అన్నదే లేదంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటు కూటమి పార్టీలు వైసీపీ ప్రభుత్వం, జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామంటూ వారు పేర్కొంటున్న విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే, మాజీ సీఎం, బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దమండ్యం మండలంలో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం నడుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేటలో జరిగే దోపిడీలు, దౌర్జన్యాలకు, వైసీపీ నాయకులు చేసే పాపాలకు పెద్దిరెడ్డే కారకుడని ఆయన అన్నారు.

రాష్ట్రంలో మరోసారి సైకోలకు అవకాశమిస్తే భూములపైనే హక్కే కాదు.. చివరకు మీ మీద మీకే హక్కు లేకుండా చేస్తారని ఆయన అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనే అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ.. కనిపించే మూడు సింహాలు మోదీ, నడ్డా, అమిత్ షా అని,… కనిపించని నాలుగో సింహమే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన అన్నారు.

కాగా, సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు సభలలో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మూడు సార్లు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రుబాబు రాష్ట్రంలో ఏపాటి అభివృద్ధి చేశాడో మీరే చెప్పండి అంటూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చినంక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

Also Read: రూటు మార్చిన కేఏపాల్, ఈసారి కొత్తగా..

విద్యం, వైద్యం విషయంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చామని, వృద్ధులకు ఇంటి వద్దకే పెన్షన్ వస్తున్నదని, పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరిచిపోయి చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తల పెట్టినట్లే అవుతుందని, ప్రస్తుతమున్న పథకాలల్లో ఒక్కటి అమలు కాదన్నారు. తాము మరోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుతమున్న పథకాలన్నీ కొనసాగిస్తామని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటూ జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News