E-Paper
Advertisement

గ్యాస్ సిలిండర్ పై ఉన్న ఈ కోడ్ అర్థం ఏంటో తెలుసా?

గ్యాస్ సిలిండర్ పై ఉన్న ఈ కోడ్ అర్థం ఏంటో తెలుసా?
Advertisement

LPG Cylinder Expiry Date: గ్యాస్ సిలిండర్ పై బరువుతో పాటు కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు, నెంబర్లు ఉంటాయి. వాటిని ఎప్పుడైనా గమనించారా?. A 26, B 26 అనే కోడ్ ను చూసే ఉంటారు కదా. వాటి వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్లను BIS 3196 ప్రమాణానికి అనుగుణంగా తయారు చేస్తారు. కార్బన్ తో తయారు చేసిన ఈ సిలిండర్లు పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (PESO) నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. సిలిండర్ల తయారీ, అమ్మకానికి BIS లైసెన్స్ కూడా పొందాలి. అయితే వాతావరణ పరిస్థితులు, వినియోగం, అరుగుదల, తుప్పు పట్టడం ఇలాంటి కారణాలతో..సిలిండర్ల వినియోగం పరిమితి ఉంటుంది. ఎల్పీజీ సిలిండర్లకు ఎక్స్ ఫైరీ ఉండదు, కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో సిలిండర్ల వినియోగాన్ని పరీక్షించి కొత్త పరీక్ష గడువు తేదీని ప్రింట్ చేస్తారు.

కోడ్ అర్థమేంటి?

తదుపరి టెస్టింగ్ డేట్ ను ఒక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ రూపంలో సిలిండర్ పై ప్రింట్ చేస్తారు. సిలిండర్ సైడ్ కాలర్లలో ఒకదానిపై A, B, C, D అనే అక్షరాలు 2 అంకెలతో ఈ కోడ్ ను ప్రింట్ చేస్తారు.

  • A అంటే జనవరి నుంచి మార్చి వరకు
  • B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు
  • C అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు
  • D అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
Advertisement

ఇంగ్లీషు అక్షరం తర్వాత చెల్లుబాటు అయ్యే సంవత్సరాన్ని ప్రింట్ చేస్తారు. ఉదాహరణకు A-26 అంటే ఆ సిలిండర్‌ను 2026 జనవరి-మార్చి మధ్యలో పరీక్షించాల్సి ఉందని అర్థం. అయితే కొన్నిసార్లు గడువు ముగిసినా.. కస్టమర్ల వద్ద ఉండిపోతాయి. నెక్ట్స్ ఫిల్లింగ్ సమయంలో పాత సిలిండర్లను మరోసారి పరీక్ష నిర్వహిస్తుంటారు. సిలిండర్ సైడ్ కాలర్ పై టెస్టింగ్ డేట్ ను ముద్రిస్తారు. అందుకే సిలిండర్ తీసుకునే ముందు వీటిని గమనించి తీసుకుంటే బెటర్.

Also Read:  పెట్రోల్ కోసం ఏకంగా బైకు ట్యాంకే పీక్కొని వచ్చేశాడు.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×