E-Paper
Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఓ సుకుమారి.. ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఓ సుకుమారి.. ఎక్కడ  చూడొచ్చంటే?
Advertisement

Oh Sukumari OTT:విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఈసారి మరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఓ!సుకుమారి(Oh Sukumari). గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్య రాజేష్.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసింది కానీ ఆ సినిమా రేంజ్ గుర్తింపు లభించలేదు. అలాంటి చిత్రాలలో ఓ సుకుమారి కూడా ఒకటి. తిరువీర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. రూరల్ కామెడీ రొమాంటిక్ కథతో జూలై 17వ తేదీన థియేటర్లలో విడుదలై ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మూడు వారాలు తిరిగేసరికి ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు.

also read:నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓ సుకుమారి..

Advertisement

సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు మరీ ముఖ్యంగా మూడు వారాలలోపే ఓటిటి స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అలాంటి చిత్రాలలో ఓ సుకుమారి కూడా ఒకటి. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 7వ తేదీన స్ట్రీమింగ్ కి రాబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రాబోతోంది.

ఓ.. సుకుమారి సినిమా స్టోరీ..

యాదగిరి (తిరువీరు) తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి. పల్లెటూర్లో సర్పంచ్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతడి తమ్ముడు (గవిరెడ్డి) తో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. వీరి తాత.. తమకున్న 80 ఎకరాల ఆస్తి కావాలంటే ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికి ముందుగా మగ బిడ్డ కలిగితే వారికే చెందాలి అని వీలునామా రాసి ఉంచడంతో ఇద్దరూ కూడా పెళ్లి కోసం పలు ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇక అన్న కంటే ముందే తమ్ముడు.. ఆస్తికోసం అప్పటికే గర్భంతో ఉన్న ఒక మార్వాడి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇక యాదగిరి కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ఊరికి చెందిన దామిని(ఐశ్వర్య రాజేష్)ని మొదటి చూపులోనే ఇష్టపడతాడు. అయితే ఆమె గురించి తెలుసుకోకుండానే తన తండ్రిని ఒప్పించి వివాహం చేసుకుంటాడు. ఊరి వాళ్లు కూడా దామినేని ముట్టుకుంటే కరెంటు షాక్ తగులుతుంది అనే విషయం దాచి .. ఊరంతా కలిసి పెళ్లి చేస్తారు. శోభనం రోజు ఆ విషయం తెలుసుకున్న యాదగిరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి.. అసలు దామినిని ముట్టుకుంటే ఎందుకు షాక్ తగులుతుంది? ఈ విషయం తెలుసుకున్న యాదగిరి ఏం చేశాడు ?చివరికి తాత చెప్పిన ఆ 80 ఎకరాలు ఎవరికి దక్కాయి? అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×