Malayalam Survival Thriller: సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు అంటే సాధారణంగా అడవి, ప్రమాదకర అడవి జంతువులు, ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితులు గుర్తుకొస్తాయి. కానీ గ్రాఫిక్స్‌పై ఆధారపడకుండా నిజమైన ఏనుగుతో ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది ? అలాంటి సాహసోపేతమైన ప్రయత్నమే ‘కాటాలన్’ (Kattalan). 2026లో విడుదలైన ఈ మలయాళ సర్వైవల్ యాక్షన్ డ్రామా థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి రావడంతో మరింత మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఉత్కంఠభరితమైన కథ, సహజమైన విజువల్స్, రియల్ ఎలిఫెంట్‌తో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళం మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
దట్టమైన అడవుల మధ్య ఓ ఏనుగు జీవితం ప్రశాంతంగా సాగుతుంటుంది. అయితే ఒక అనుకోని సంఘటనతో ఓ వ్యక్తి అడవిలో ఒంటరిగా చిక్కుకుపోతాడు. బయటకు రావడానికి మార్గం వెతుకుతుండగా అతని ఎదురుగా ఒక భారీ అడవి ఏనుగు నిలుస్తుంది. మొదట అది నార్మల్ గా ఎదురుపడిన సంఘటనలా కనిపించినా, క్రమంగా పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఆ ఏనుగు ఎందుకు అంత ఆగ్రహంగా ప్రవర్తిస్తోంది ? అనేది అస్సలు అర్థం కాదు.
అడవిలో ఆహారం లేదు, సహాయం చేసే మనుషులు లేరు, బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అతన్ని ప్రతి అడుగులో ప్రాణహాని వెంటాడుతుంటుంది. ఏనుగు దాడుల నుంచి తప్పించుకుంటూనే హీరో అడవిలో మనుగడ సాగించాల్సి వస్తుంది. ఇదే సమయంలో అడవిలో దాగి ఉన్న మరికొన్ని రహస్యాలు బయట పడతాయి. అక్కడి పరిస్థితులు ఎందుకు అంత ప్రమాదకరంగా మారాయి ? అడవిలో హీరో ఎదుర్కొన్న పరీక్షలు ఏమిటి ? అతడు చివరకు ప్రాణాలతో బయట పడ్డాడా ? ఏనుగుతో జరిగిన సంఘర్షణ ఎలా ముగిసింది ? అనే అంశాలను దర్శకుడు క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా నడిపించాడు.
ఈ సినిమాకు అతిపెద్ద బలం రియల్ ఎలిఫెంట్‌తో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు బదులుగా సహజమైన చిత్రీకరణను ఎంచుకోవడం వల్ల ప్రతి సన్నివేశం నిజంగా జరిగినట్లే అనిపిస్తుంది. అడవిలోని విజువల్స్, సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడిని పూర్తిగా కథలోకి తీసుకెళ్తాయి. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించడం మరో విశేషం. మలయాళ నటీనటుల సహజమైన నటన, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే సినిమాకు మరింత బలం చేకూర్చాయి. సర్వైవల్ జానర్‌కు అవసరమైన టెన్షన్‌ను దర్శకుడు చివరి వరకు కొనసాగించాడు.
‘కాటాలన్’ ప్రస్తుతం ManoramaMAX ఓటీటీలో తెలుగు ఆడియోతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సర్వైవల్ థ్రిల్లర్లు, ప్రకృతి నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాలు, జంతువులతో కూడిన ఉత్కంఠభరిత కథలు ఇష్టపడే వారు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు. గ్రాఫిక్స్ కంటే సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిత్రం ప్రతి సన్నివేశంలో ఉత్కంఠను కొనసాగిస్తూ, చివరి వరకు సస్పెన్స్ ను కొనసాగిస్తుంది.
Read Also: కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్