Man Arrested: అసలే ఓ వైపు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో జరిగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదొక ప్రదేశంలో పుష్ప తరహాలో స్మగ్లింగ్ అనే న్యూస్ మనం వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఓ దుండుగడు పుష్ప మూవీ చూసొచ్చి ఏకంగా బస్సును దొంగలించడం హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
తమిళనాడుకు చెందిన సాదిక్ అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం కాకినాడ జిల్లా నర్శీపట్నంకు వచ్చాడు. అనంతరం పుష్ప-2 మువీ చూసి బస్టాండింగ్‌లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సులో నిద్రించాడు. ఈ నేపథ్యంలో బస్సుకు తాళం ఉండటాన్ని గమినించాడు. ఇంకేంముంది.. సినిమా స్టైల్లో స్టార్ట్ చేసి బస్సును ఎత్తుకెళ్లాడు. మధ్యలో సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ నిద్రించాడు.
తెల్లవారుజామున నాలుగుగంటల సమయంలో స్థానికులు, డ్రైవర్ వచ్చి చూడగా బస్సు కనిపించలేదు.. దీంతో అతను పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి హైజాక్ చేసిన బస్సు.. చింతలూరు వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకొని.. అలాగే బస్సులో గుర్రుపెట్టి నిద్రపోతున్న దొంగను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Also Read: వామ్మో.. ఈ దొంగ మహా ముదురు.. లాయర్‌కే చుక్కలు చూపించాడుగా!
ఇదిలా ఉంటే.. తిరుపతి జిల్లా చంద్రగిరి లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఆర్టీసీ కండక్టర్ పై రాళ్లు విసిరి విచక్షణా రహితంగా దాడి చేశారు దుండగులు. తీవ్రంగా గాయపడ్డ సుధాకర్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అయితే కండక్టర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు.. అనంతరం నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు సీఐ.. మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తే.. నిందితులను ఎలా వదిలేస్తారంటూ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం కావాలని.. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు కుటుంబసభ్యులు.
పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు…
తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి పుష్ప 2 చూసి బస్టాండులోని బస్సులో పడుకున్నాడు.
బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ పడుకున్నాడు.… pic.twitter.com/SZ2b9Wctyv
— Telangana Awaaz (@telanganaawaaz) December 24, 2024