BigTV English

Unstoppable S4: ఒకే స్టేజ్ పై బాలయ్య – వెంకీ మామ.. ప్రోమో అదుర్స్..!

Unstoppable S4: ఒకే స్టేజ్ పై బాలయ్య – వెంకీ మామ.. ప్రోమో అదుర్స్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ విత్ ఎన్.బీ.కే కార్యక్రమానికి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తవగా.. ఇప్పుడు నాలుగవ సీజన్ కూడా నడుస్తోంది. అందులో భాగంగానే ఏడవ ఎపిసోడ్ కి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ (Venkatesh) గెస్ట్ గా విచ్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా.. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


ఆకట్టుకున్న ప్రోమో..

వెంకటేష్ – బాలయ్య ఎపిసోడ్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఇద్దరు కూడా ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా ఉండే వాళ్ళం అంటూ గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. షో కి వెంకటేష్ తో పాటు ఆయన సోదరుడు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (Sureshbabu)కూడా హాజరయ్యారు. ఇకపోతే చిన్నప్పుడు వెంకటేష్ చేసిన అల్లరి గురించి బాలకృష్ణ సురేష్ బాబును అడిగి మరీ నవ్వులు పూయించారు. అంతేకాదు ఈ టాక్ షోలో వెంకటేష్ తండ్రి, దివంగత ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు(Daggubati Ramanaidu)గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. రామానాయుడు గురించి చెబుతూ అటు సురేష్ బాబు ఇటు వెంకటేష్ ఇద్దరూ కూడా ఎమోషనల్ అయ్యారు.
ఇకపోతే వెంకటేష్ కూతుర్ల గురించి అలాగే మేనల్లుడు నాగచైతన్య(Naga Chaitanya) గురించి కూడా బాలకృష్ణ ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.


సంక్రాంతికి వస్తున్నాం..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (Daggubati Ramanaidu) వారసుడిగా ‘కలియుగ పాండవులు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. అతి తక్కువ సమయంలోనే ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా లేడీ అభిమానులు భారీగా పెరిగిపోయారని చెప్పవచ్చు. ఇక ఒకవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే, మరొకవైపు మాస్ , యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు వెంకటేష్. అంతేకాదు అప్పుడప్పుడు తన సినిమాలలో కామెడీ కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి సందడి చేశాయి. ఇప్పుడు మరోసారి మూవీ అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఏది ఏమైనా మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతోంది.. ఇక ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్నట్లు సమాచారం.

 

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×