BigTV English

Bike Thief: వామ్మో.. ఈ దొంగ మహా ముదురు.. లాయర్‌కే చుక్కలు చూపించాడుగా!

Bike Thief: వామ్మో.. ఈ దొంగ మహా ముదురు.. లాయర్‌కే చుక్కలు చూపించాడుగా!

Bike Thief: అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టాడనే సామెత మీరు వినే ఉంటారు. మన పెద్దేళ్లు ఏ మాట కూడా ఊరకనే చెప్పలేదు. ఇంతకీ ఇందంతా ఎందుకు చెబుతున్నారంటారా.. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే  మీరు కూడా షాక్ అవుతారు.  వివరాల్లోకి వెళ్తే.. కావలిలోని ఓ వ్యక్తి  జల్సాలకు అలవాటు పడ్డాడు. మరి ఎంజాయ్ చేయాలంటే డబ్బులు కావాలి కదా.. ఇందుకోసం మనోడు అడ్డదారులు మొదలు పెట్టాడు. బైకులు చోరీలు చేసి వాటిని అమ్ముకొని.. వచ్చే డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఎలా చోరీ చేసేవాడంటే, సీసీ కెమరాలకు కూడా చిక్కనంతగా..


అయితే ఎంత పెద్ద దొంగ అయినా.. ఎన్ని తప్పులు చేసిన ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే.. అలాగే ఇతను కూడా చాలా సార్లు దొంగతనం చేసి దొరికిపోయాడు. జైలుకు వెళ్లడం. మళ్లీ బెయిల్ మీద బయటకు రావడం. కొత్త స్టైయిల్‌లో చోరీలు చేయడం కూడా ఇతడికి వెన్నతో పెట్టిన విద్య.  ఇలా మూడు బైకులు.. ఆరు స్కూటీలు అన్నట్లుగా సాగుతోంది మనోడి యవ్వారం. అయితే దొంగతనం కేసులు పెరిగిపోవడంతో అయ్యగారు.. తన కేసులను కోర్టులో వాదించేందుకు లాయర్‌ని కూడా మాట్లాడుకున్నాడు.

ఈ మధ్యకాలంలో ఓ కేసుకు సంబంధించి కోర్టులో వాయిదాలపై మాట్లాడేందుకు ఈ వ్యక్తి లాయర్ ఇంటికి వచ్చాడు. కేసు గురించి మాట్లాడి, న్యాయవాదికి ఫీజు కూడా చెల్లించాడు. ఇదిలా ఉంటే మనోడి కన్ను లాయర్ బైక్ పై పడింది . ఏ లాయర్ అయితే తను జైలుకు పోకుండా కోర్టులో కేసులను వాదిస్తూ వస్తున్నాడో ఆ న్యాయవాది బైక్‌ను దొంగతనం చేశాడు. ఇక బైక్ పోయిన విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేసి జరిగిదంతా వివరించారు లాయర్. దీంతో రంగంలోకి దిగిన  పోలీసులు ఎట్టకేలకు దొంగతనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నట్లు కావలి టూటౌన్ సీఐ గిరిబాబు పేర్కొన్నారు. మొత్తానికి కేసులు వాదించేందుకు మాట్లాడుకున్న లాయర్ బైక్ దొంగతనం చేయడం ఇక్కడ హైలెట్.


Also Read: జగన్‌కు పీడకలను మిగిల్చిన 2024.. మరి 2025 అయిన కలిసొస్తుందా ..?

ఇదిలా ఉంటే.. వనపర్తి జిల్లా జాతీయ రహదారిపై ఖాకీ సినిమా తరహాలో దోపిడీకి తెగబడ్డారు బీహార్ పార్ధీ గ్యాంగ్. ఈ కేసును ఛాలెంజింగా తీసుకుని చేధించారు పోలీసులు. రెండు రోజుల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. జగిత్యాల జిల్లాకు చెందిన మూడు కుటుంబాలు తిరుపతికి వెళ్లి వస్తూ ఎన్ హెచ్ 44పై ఆగారు. అదే టైంలో అక్కడికి వచ్చిన పార్ధీ గ్యాంగ్ వాహనంపై దాడి చేసి.. వారి నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. దారిదోపిడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగలను పట్టుకున్నారు.

మరోవైపు అమ్మవారికి కన్నం పెడదాం అనుకున్న దొంగలే.. ఆ అమ్మవారి భక్తుల చేతికే చిక్కి కటకటాలపాలయ్యారు. నిర్మల్ జిల్లా  జరిగింది ఘటన. రాజరాజేశ్వరుని ఆలయంలో హుండిని ఎత్తుకెళ్లారు దొంగలు. ఓ మహిళ, మరో వ్యక్తి కారులో వచ్చి హుండిని ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే దొంగలు వెళ్తున్న కారు భైంసా మండలం మహాగ్రామం శివారులో చెట్టుకు ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న స్థానికులను చూసి పరారయ్యాయి దొంగలు. అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా… 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు పోలీసులు. హుండిని దొంగతనం చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×