E-Paper
Advertisement

Viral News: మాజీ భార్య అక్క తిట్టిందని.. వాటర్ ట్యాంక్‌ ఎక్కిన 4 పెళ్లిళ్ల మొగుడు

Viral News: మాజీ భార్య అక్క తిట్టిందని.. వాటర్ ట్యాంక్‌ ఎక్కిన 4 పెళ్లిళ్ల మొగుడు
Advertisement

Viral News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు సహజం, కానీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ భార్య బంధువుల మాటలకు నొచ్చుకుని ఓ వ్యక్తి ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి నానా హంగామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వేములవాడ పట్టణానికి చెందిన గుడిసె అశోక్ అనే వ్యక్తికి గతంలో నాలుగు వివాహాలు అయ్యాయి. అయితే.. వివిధ కారణాల వల్ల నలుగురు భార్యలతో విడిపోయి, ప్రస్తుతం అతను ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతని మూడవ భార్య అక్క అశోక్‌ను ఏదో విషయమై దూషించింది. ఆ మాటలకు తీవ్రంగా మనస్తాపం చెందిన అశోక్ పట్టణంలోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ నిరసన చేశాడు.

Advertisement

తమను తిట్టిన మూడవ భార్య అక్క స్వయంగా ట్యాంక్ వద్దకు వచ్చి అందరి ముందూ తనకు క్షమాపణ చెప్పాలని అశోక్ మొండిగా డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు అశోక్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు. కిందకు దిగమని పోలీసులు ఎంత కోరినా తన డిమాండ్ నెరవేరాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నాడు.

పరిస్థితి తీవ్రతను గమనించిన డీఎస్పీ శ్రీనివాసులు రంగంలోకి దిగారు. అశోక్‌తో చర్చలు జరిపి, అతన్ని తిట్టిన మహిళతో కచ్చితంగా క్షమాపణ చెప్పిస్తామని గట్టి హామీ ఇచ్చారు. డీఎస్పీ మాటలపై నమ్మకంతో అశోక్ చివరకు శాంతించి ట్యాంక్ పైనుంచి కిందకు దిగివచ్చాడు. దీంతో మూడు గంటలుగా కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. ఈ ఘటన చూసిన స్థానికులు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా అశోక్ మనస్తత్వం ఇంకా ఇంత సున్నితంగా ఉందేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు ఢీకొని యువకుడు మృతి!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×