E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: బతుకమ్మ లేని విగ్రహం తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కాదు.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: బతుకమ్మ లేని విగ్రహం తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కాదు.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో నూతనంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు ఆవిష్కరించిన ఈ నూతన విగ్రహంలో తెలంగాణ సంస్కృతికి వెన్నెముక వంటి ‘బతుకమ్మ’ లేకపోవడం శోచనీయమని ఆమె పేర్కొన్నారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి రూపం ఎంతమాత్రమూ తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కాబోదని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్రోద్యమ కాలంలో తెలంగాణ బిడ్డలంతా కలిసి తమ మూలాలను, సంస్కృతిని ప్రతిబింబించేలా తల్లికి ఒక అపురూప రూపాన్ని ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు ఆ రూపురేఖలను మార్చడం అనేది ఉద్యమ గుర్తులను చెరిపేసే దుస్సాహసమని ఆమె అభివర్ణించారు. బతుకమ్మతో కూడిన నాటి తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమ త్యాగాలకు, స్మృతులకు సజీవ దృశ్య రూపమని ఆమె కొనియాడారు.

Advertisement

చరిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం లేని వారు, మొదట ఆ చరిత్రను చెరిపేయాలని లేదా వక్రీకరించాలని చూస్తారని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు సరిగ్గా అదే చేస్తోందని కవిత విమర్శించారు. తెలంగాణలో నేడు 90 శాతం మంది ప్రజలకు రేవంత్ రెడ్డి కంటే గొప్ప ఉద్యమ నేపథ్యం ఉందని ఆమె ఎద్దేవా చేశారు. తనకు స్థానం లేని ఉద్యమ చరిత్రను రూపుమాపాలి అనే అల్పసంతోషంతోనే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.

తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని అవమానించేలా ఉన్న ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ రూపొందించిన నాటి ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఒకరోజు ఇదే శాసనసభ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం ఖాయమని ఆమె అన్నారు.

విశారదన్ మహరాజ్ అరెస్ట్ అక్రమం

Advertisement

ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖండించారు. ఈ అరెస్ట్ అక్రమమని అన్నారు. అరెస్ట్ చేసిన విశారదన్ మహరాజ్ ను పలు స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టటం దారుణమన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకే గర్వకారణం..

ప్రముఖ కవి, అధ్యాపకులు నందిని సిధారెడ్డి  గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం ఎంతో సంతోషానిచ్చిందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ఆయనకు ఈ అవార్డు రావటం తెలంగాణకే గర్వకారణమని చెప్పారు. వచన కవిత్వ విభాగంలో నందిని సిధారెడ్డి గారు రచించిన “అనిమేష” కవితా సంపుటికి పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. ఆయన కలం నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.

Read Also: Viral News: మాజీ భార్య అక్క తిట్టిందని.. వాటర్ ట్యాంక్‌ ఎక్కిన 4 పెళ్లిళ్ల మొగుడు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×