E-Paper
Advertisement

Road Accident: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు ఢీకొని యువకుడు మృతి!

Road Accident: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు ఢీకొని యువకుడు మృతి!
Advertisement

Road Accident: నేటి కాలంలో సోషల్ మీడియాలో వచ్చే కొన్ని సెకన్ల లైకులు, వ్యూస్ కోసం యువత పిచ్చి పీక్స్‌కు చేరుతోంది. క్షణకాలం పాటు వచ్చే ఆ పాపులారిటీ కోసం తమ నిండు ప్రాణాలను పణంగా పెడుతూ, తిరిగిరాని లోకాలకు వెళ్తున్న ఉదంతాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సాహసానికి, మూర్ఖత్వానికి మధ్య ఉన్న గీతను మరిచిపోయి చేసే స్టంట్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా హర్యానాలో చోటుచేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం.

హర్యానాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ 18 ఏళ్ల మహమ్మద్ మోయిన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మోయిన్ తన స్నేహితుడు మహమ్మద్ షాద్ ఒక కెమెరామెన్‌తో కలిసి ఎక్స్‌ప్రెస్‌వే పైకి వెళ్లాడు. వాహనాలు అత్యంత వేగంతో ప్రయాణించే ఆ రహదారిపై, నిబంధనలకు విరుద్ధంగా వీడియోలు తీస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని బలంగా ఢీకొట్టింది.

Advertisement

ఈ ప్రమాదంలో మోయిన్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని స్నేహితుడు షాద్ , కెమెరామెన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఒక చిన్న పొరపాటు, క్షణికమైన ఆవేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.

Also Read: నెతన్యాహు మృతి చెందారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో వెనుక నిజమెంత?

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×