హిందూ మతంలో పూజలకు, మంత్రోచ్ఛారణకు చాలా ప్రముఖ్యత ఉన్నది. లయబద్దంగా సాగే మంత్రోచ్ఛారణ.. మనిషిలోనే కాదు, యావత్ పశు పక్షాదులలో వైబ్రేషన్స్ కలిగిస్తాయి. మంత్ర పఠనం ఎన్నో అద్భుతాలకు సృష్టిస్తుంది. పోయే ప్రాణాలను నిలబెట్టి శక్తి మంత్ర పఠనానికి ఉంటుంది. నమ్మడం లేదా? ఈ వీడియో చూస్తే.. మీరు కచ్చితంగా నమ్మి తీరుతారు.
మంత్ర పఠనంతో కొండముచ్చును బతికించాడు!
మన శాస్త్రంలో మంత్రాలకు ఎంతో శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయి. శక్తిమంతమైన ఈ మంత్రాలను భక్తిశ్రద్ధలతో జపిస్తే కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని బతికించవచ్చు అంటారు. అచ్చంగా ఇలాంటే ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కొండముచ్చు కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతుంది. కొన ఊపిరితో కొట్టు మిట్టాడింది. చాలా మంది ఆ కొండముచ్చు చనిపోయింది అనుకున్నారు. కానీ, ఓ వ్యక్తి కొనఊపిరితో ఉన్న కొండముచ్చును బతికించేందుకు నమోకర్ మహా మంత్రాన్ని జపించడం మొదలు పెట్టారు. ఆ మంత్రం పూర్తయ్యే సరికి చావు బతుకుల మధ్యన ఉన్న కొండ ముచ్చు లేసి చంగు చంగున ఎగరడం మొదలు పెట్టింది. ఈ వింతను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకు మంత్ర పఠనానికి అంత శక్తి ఉందంటే?
మంత్రంలో ఉపయోగించే ప్రతి అక్షరానికి ప్రత్యేక ధ్వని ఉంటుంది. సంస్కృత మంత్రాలను పఠించడంలో జాగ్రత్త వహించాలి. ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా పలకాలి అంటారు పండితులు. మంత్ర పఠన మనిషిలోని శక్తిని, బలాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది. మంత్రాలలో ఉండే అక్షరాలు కలిగించే ప్రతి ధ్వని మానవుల మానసిక స్థితిపై తన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆకుల మీది నుంచి వీచే చల్లని పిల్లగాలి వల్ల మనకు కలిగే ఆహ్లాదం, గలగలమని పారే సెలయేరు ధ్వని మనకు కలిగించే హాయి కలిగిస్తాయో? ఉరుములు, మెరుపుల వల్ల కలిగే బాధ, భయం ఎలా కలుగుతాయో? అలాగే.. మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే ధ్వని కూడా మనుషుల హృదయాన్ని తాకుతుంది.
మంత్ర పఠనంతో కొండముచ్చును బతికించాడు!
మన శాస్త్రంలో మంత్రాలకు ఎంతో శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయి. శక్తిమంతమైన ఈ మంత్రాలను ఎంతో భక్తిశ్రద్ధలతో జపిస్తే కొనఊపిరితో ఉన్న జీవిని బతికించవచ్చంటుంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. కరెంట్ షాక్తో కిందపడిపోయి… pic.twitter.com/A9a5B8xNFr
— ChotaNews App (@ChotaNewsApp) February 11, 2025
Read Also: భర్త ధనవంతుడంటూ బంధువులకు పంగనామాలు.. ‘ఫేక్ పెళ్లి చేసుకుని మరీ..
మంత్ర పఠనంతో మనిషిలో అత్యున్నత చైతన్యం
మంత్ర పఠనం చేయడం వల్ల మనసు మరింత చైతన్యవంతం అవుతుంది. మానసిక పరిణతి పెరుగుతుంది. జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో మంత్రాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడుతాయి. వ్యాధులను నివారించడంలో సాయపడుతాయి. మనిషిని ఆవరించి ఉండే చెడు శక్తులు దూరం అవుతాయి. సంపదను చేకూర్చడంతో పాటు సూపర్ నేచురల్ శక్తులను పెంపొందించే శక్తి మంత్రాలకు ఉంటుంది. ఆనందకరమైన స్థితికి తీసుకువెళ్ళే శక్తి మంత్ర పఠనం ద్వారా అభిస్తుంది. చావు బతుకులలో ఉన్న ప్రాణాన్ని కూడా కాపాడే శక్తి మంత్రాలకు, మంత్ర పఠనాలకు ఉంటుంది. అదే మంత్ర పఠన ప్రభావంతో కొన ఊపిరిలో ఉన్న కొండముచ్చు లేచి పరిగెత్తింది.
Read Also: నెలకు రూ. 123 కోట్లు సంపాదిస్తున్న అమ్మాయిలు, ఛీ.. మరీ అలానా?