BigTV English

Laila: లైలానే నా కొత్త పిన్ని.. వెంకటేష్ రీల్ కొడుకు రచ్చ

Laila: లైలానే నా కొత్త పిన్ని.. వెంకటేష్ రీల్ కొడుకు రచ్చ

Laila: ఒక సినిమా హిట్ అవ్వాలి అన్నా.. ఫట్ అవ్వాలి అన్నా కథతో పాటు ప్రమోషన్స్ అనేవి మస్త్ ఉండాలి. అది కూడా అల్లాటప్పా ప్రమోషన్స్ చేస్తే చాలదు. ఆ సినిమాకు ప్రేక్షకుడు ఎందుకు రావాలి అని అందరికీ తెలిసేలా ప్రమోషన్స్ చేయాలి. ఈ మధ్య అదే ఫ్యాషన్ గా మారింది. ఇక హీరోలు సైతం ట్రెండ్ కు తగ్గట్టుగా మారుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ కోసం వెంకటేష్ ఏ రేంజ్ లో కష్టపడ్డాడో అందరికీ తెల్సిందే. యూట్యూబ్, షోస్.. దగ్గర నుంచి ప్రతి ఊరు వెళ్లి .. ప్రేక్షకులను పలకరించి.. వారితో ఆడిపాడి.. తమ సినిమా గురించి చెప్పి, ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాడు. నిజం  చెప్పాలంటే అది మంచి పద్దతి. ప్రేక్షకుల వద్దకు వెళ్లి తమ సినిమాను ఆదరించామని చెప్పడం వలన.. ఆ సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.


ఇక కుర్ర హీరో విశ్వక్ సేన్.. వెంకీ మామ అంత ప్రమోషన్స్ చేయలేదు కానీ, వెంకీ రీల్ కొడుకును మాత్రం వాడేస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటించిన చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని షురూ చేసిన విశ్వక్.. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వారితో రీల్స్ చేస్తూ మరింత హైప్ తీసుకొస్తున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన బుల్లిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు బుల్లిరాజు లేకపోతే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు అని చెప్పొచ్చు. పిల్లాడితో బూతులు మాట్లాడించారు అన్నవారు కూడా అతడి మాట్లాడే మాటలకు నవ్వకుండా ఉండలేకపోయారు అని చెప్పొచ్చు. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు బుల్లిరాజు.  ఇక ఈ సినిమా తరువాత  వరుస అవకాశాలను అందుకుంటున్నాడు బుల్లిరాజు అలియాస్ రేవంత్.


NTR: రౌడీ హీరోకి వాయిస్ ఇవ్వడం ఏమో కానీ.. ఆ లుక్ ఏదైతే ఉందో.. పూనకాలు అంతే

ఇక తాజాగా బుల్లిరాజు.. లైలా ప్రమోషన్స్ లో భాగం అయ్యాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో.. నాన్నో.. పిన్ని వచ్చింది అని చెప్పే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు రియల్ గా తన తండ్రికి కొత్త పిన్నిని తీసుకురావడానికి బయల్దేరాడు బుల్లిరాజు. లైలా అనే అమ్మాయి ఎవరో  వచ్చిందంట. చాలా అందంగా ఉంటుందంట. ఆమె ఎవరో కనుక్కొని.. మా నాన్నకు పిన్నిని  తీసుకెళ్తా  అని బయల్దేరిన బుల్లిరాజుకు.. మధ్యలో విశ్వక్ సేన్ కనిపిస్తే.. లైలా అంట ఎవరో.. ఆమె ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు.

దానికి విశ్వక్.. ఎందుకు నీకు అంటే.. మా నాన్నకు రెండో పిన్నిని చేసేద్దామని అని అనగానే.. మీ నాన్న ఏం చేస్తాడ్రా  దాంతో అని విశ్వక్ అడుగుతాడు. ఇంకేం చేస్తాడు.. కొరికేస్తాడు.. కొరికేస్తాడు అని చెప్తాడు. దీంతో వెంటనే విశ్వక్..  బుల్లిరాజును నిజంగానే కొరికేస్తాడు. ఇక ఏడుస్తూ బుల్లిరాజు.. నిజంగానే కొరికేసాడు. ఈ లైలాను వెళ్లి థియేటర్ లోనే పట్టుకుంటాను అని చెప్పుకొస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ హైప్ తో లైలా హిట్ ను అందుకుంటుందో.. లేదో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×