BigTV English

AP Govt: ఆ రెండు పథకాలకు త్వరలో గ్రీన్ సిగ్నల్.. ఏపీ ప్రజల కోరిక నెరవేరినట్లే..

AP Govt: ఆ రెండు పథకాలకు త్వరలో గ్రీన్ సిగ్నల్.. ఏపీ ప్రజల కోరిక నెరవేరినట్లే..

AP Govt: ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలను తీసుకోనుంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, మరో రెండు కొత్త నిర్ణయాలను తీసుకుందని సమాచారం. అదే జరిగితే ఎన్నో ఏళ్ల నుండి ప్రజల ఎదురుచూపులకు ప్రభుత్వం శుభం కార్డు వేసినట్లేనని చెప్పవచ్చు. ఇంతకు ప్రభుత్వం తీసుకోనున్న ఆ నిర్ణయాలేమిటి? ప్రజలకు ఏ తీరులో మేలు చేకూరుతుందో తెలుసుకుందాం.


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, పింఛన్ నగదును పెంచి లబ్దిదారుల్లో ఆనందాన్ని నింపింది. అది కూడ పింఛన్ దారుడు మృతి చెందితే వెనువెంటనే సదరు లబ్దిదారుడి భార్యకు పింఛన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎందరో పింఛన్ దారులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. అంతేకాదు పింఛన్ మార్పుకు కూడ ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు దీపావళి రోజు దీపం 2.ఓ పథకాన్ని అమలు చేసి, ఏడాదికి మూడు సిలిండర్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఓ వైపు రాష్ట్రంలోని రహదారుల అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు కూడ చేయడంతో విద్యార్థి సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఆఫీసుల చుట్టూ.. ప్రజలు కాళ్లరిగేలా తిరిగే సమస్యలకు చెక్ పెడుతూ.. వాట్సాప్ గవర్నెన్స్ ను కూడ అమలు చేసింది. ఇలాంటి తరుణంలో మరో రెండు కొత్త నిర్ణయాలకు ప్రభుత్వం ముందడుగు వేయబోతున్నట్లు ఇటీవల మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.


ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఆధారం. ఈ కార్డు లేకుంటే ఏ పథకం వర్తించదు. అందుకే రేషన్ కార్డుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడ నూతన రేషన్ కార్డులను మంజూరు చేసింది. అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడ అతి త్వరలో నూతన రేషన్ కార్డులను అందించేందుకు చర్యలు తీసుకోనుందట. అర్హత ఉండి కూడ రేషన్ కార్డు లేని వారి జాబితాను ఇప్పటికే అధికారులు సిద్దం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. నూతన రేషన్ కార్డులను మంజూరు చేసి, అర్హులకు మేలు చేకూర్చాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ, ఇటీవల సీఎం చంద్రబాబు ఇదే విషయంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Also Read: AP Govt Whatsapp Governance Service: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్..

అంతేకాకుండ నూతన పింఛన్ లను కూడ మంజూరు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోందట. ఇప్పటికే పింఛన్ పొందుతున్న అనర్హులను గుర్తించేందుకు అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. అందులో సుమారు 10 వేలకు పైగా అనర్హులను ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తోంది. అనర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ది కంటే, అర్హులకు మేలు చేకూర్చాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందుకే త్వరలో నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు, నూతన పింఛన్ లను కూడ అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అయితే ఈ రెండు కార్యక్రమాలను అమలు చేయడంపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×