ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. సొంత మనుషులే మోసం చేస్తున్నారు. నిట్టనిలువునా ముంచేస్తున్నారు. కట్టబట్టలతో నడిరోడ్డున నిలబెడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ చైనీస్ మహిళ(Chinese Women) ‘ఫేక్ పెళ్లి’ (Fake Marriage) చేసుకుని మరీ బంధువులను మోసం చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మెంగ్ (Meng) అనే 40 ఏండ్ల మహిళ 2014లో రియల్ ఎస్టేట్ ఏజెన్సీ (Real Estate Agency)ని నడిపింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో ఆమె తన కంపెనీని మూసి వేయాల్సి వచ్చింది. అయితే, కొంతకాలం డబ్బులు లేక సతమతం అయ్యింది. అదే సమయంలో తన దగ్గర పని చేస్తున్న డ్రైవర్ జియాంగ్(Jiang) తో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. సదరు డ్రైవర్ ను తన భర్తగా నటించమని కోరింది. తను కూడా సరే అన్నాడు. చివరకు ఇద్దరూ కలిసి బంధువుల సమక్షంలో ఫేక్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది.
భర్తను రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పరిచయం
మెంగ్..డ్రైవర్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ… అతడిని తన బంధువులకు అతడు చాలా ధనవంతుడని, ఆయనకు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయని పరిచయం చేసింది. తన కంపెనీలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్ ఇప్పిస్తానని బంధువులకు చెప్పింది. వారు కూడా ఆమె మాటలు నమ్మారు. అంతేకాదు, బంధువులను నమ్మించేందుకు ఆమె స్వయంగా ఒక మిలియన్ యువాన్లు($137,000) విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. దాన్ని సగం ధరకే తన బంధువుల్లో ఒకరికి అమ్మింది. తన భర్త వల్లే అంత డిస్కౌంట్ లభించిందని అందరికీ చెప్పింది. అంతేకాదు, బంధువులు అంతా తమ దగ్గర ఆస్తులు కొనుగోలు చేయాలని సూచించింది. ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్లు వచ్చేలా చూస్తానని చెప్పింది.
మెంగ్ మాటలు నమ్మిన బంధువులు
బంధువులను మరింతగా నమ్మించేందుకు మెంగ్ కొత్త విల్లాలు, అపార్ట్ మెంట్లకు తీసుకెళ్లింది. అందులో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇప్పిస్తానని చెప్పింది. సరే అని చెప్పి పలువురు బంధువులు ఆమెకు పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చారు. కొంత మంది మంచి ఇండ్లు కొనుగోలు చేసేందుక ప్రస్తుతం ఉంటున్న ఇళ్లను కూడా అమ్మేశారు. వారికి 2018-2019 మధ్యలో పలువురికి ప్లాట్లను అప్పగించింది. అయితే, వాటికి ఆమె ప్రతి నెల అద్దె చెల్లించేది. బంధువులకు మాత్రం ఆ ఫ్లాట్లు మీవే అని అబద్దం చెప్పింది. కొద్ది నెలలకు ప్రస్తుతం డిస్కౌంట్లు అందుబాటులో లేవు అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. వారిలో ఒకరికి అనుమానం రావడంతో ఆ ఫ్లాట్ల వ్యవహారంపై పూర్తిగా ఆరా తీశాడు. అప్పుడు తనకు అసలు విషయం తెలిసింది. తాము నివసిస్తున్న ఫ్లాట్ తమది కాదని తెలుసుకున్నాడు. మెంగ్ తమను మోసం చేసిందని గుర్తించాడు.
మోసగత్తెకు 12 ఏండ్లు జైలు శిక్ష
బంధువులు అంతా కలిసి మెంగ్ పై కేసు పెట్టారు. ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం మెంగ్ కు 12 సంవత్సరాల జైలు శిక్ష, ఆమెకు భర్తగా నటించిన జియాంక్ కు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఉన్న మరికొంత మందికి 5 ఏండ్లు శిక్షవేసింది.
Read Also: నెలకు రూ. 123 కోట్లు సంపాదిస్తున్న అమ్మాయిలు, ఛీ.. మరీ అలానా?