Nalgonda: నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్రంపోడుకు చెందిన నవీన్ , అనూష ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 14 రోజులకి తిరిగి వారిని పిలిపించి ఓ గుడిలో వివాహం చేశారు పెద్దలు. బుధవారం నవవధువులు ఇద్దరు బైక్ పై గుర్రంపోడుకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో అక్కడే ఉన్న బ్రిడ్జి పై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులోకి అనూష పడిపోయింది. గమనించిన స్థానికులు దాదాపు 20 నిమిషాల తర్వాత నీట మునిగిన అనూషను ఒడ్డుకు చేర్చారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న నవీన్ సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు.