Crime News: కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకించాడనే కోపంతో.. 2 కిలోమీటర్ల పాటు వెంటాడి మరీ యువకులను కారుతో ఢీ కొట్టిన దంపతులు. ఈ దుర్మార్గమైన ఘటన బెంగళూరులోని జేపీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మనోజ్, ఆర్తి అనే దంపతులు రాత్రి సమయంలో కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో దర్శన్ , వరుణ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తున్నారు. ఆ ప్రాతంలో ట్రాఫిక్ ఎక్కువుగా ఉండటంతో కారు మిర్రర్‌కు బైక్ తాకింది.. దీంతో వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ తర్వాత తిరిగి ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా.. ఆ దంపతులు వారిపై కోపంతో దాదాపు 2 కిలోమీటర్ల పాటు వెంబడించి వారిని కారుతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న బాధితులను హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందాడు. నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.