E-Paper
Advertisement

Mumbai: అగ్గిపెట్టెంత కొంప రూ.1.25 కోట్లా?ఎక్కడో కాదు ఇండియాలోనే? టాయిలెట్ ఎక్కడుందంటే?

Mumbai: అగ్గిపెట్టెంత కొంప రూ.1.25 కోట్లా?ఎక్కడో కాదు ఇండియాలోనే? టాయిలెట్ ఎక్కడుందంటే?

ముంబై.. కలల నగరం.. దేశ వాణిజ్య రాజధాని నగరం.. వేలాది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ నగరానికి వస్తుంటారు. అయితే, నివసించడానికి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకోవాలన్నా లేదా సొంతంగా కొనుగోలు చేయాలన్నా ముంబై సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అపార్ట్‌మెంట్ వీడియో ముంబైలోని రియల్ ఎస్టేట్ దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. కేవలం కొన్ని చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక చిన్న ఫ్లాట్ ధర అక్షరాలా రూ. 1.25 కోట్లు అని తెలియడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వంట గదికి ఎదురుగానే బాత్రూమ్.. 

రెడ్డిట్ (Reddit) వేదికగా షేర్ చేయబడిన ఈ వీడియోలో.. ఒక యువతి ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్‌ను చూపిస్తోంది. లోపల ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ చాలా విలాసవంతంగా ఉన్నప్పటికీ.. ఆ ఫ్లాట్ విస్తీర్ణం మాత్రం చూసేవారికి క్లాస్ట్రోఫోబియా (ఇరుకైన ప్రదేశాల పట్ల భయం) కలిగిస్తోంది. హాల్ నుండి కిచెన్ వరకు అన్నీ చాలా చిన్నవిగా ఉండటమే కాకుండా.. వంటగదికి సరిగ్గా ఎదురుగానే బాత్‌రూమ్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నెటిజన్లు కామెంట్స్.. నవ్వులే నవ్వుల్.. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘టాయిలెట్ సీటు మీద కూర్చుని వంటగదిలో మరుగుతున్న పాలను గమనించేంత సౌకర్యవంతంగా దీనిని నిర్మించారు’ అంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. మరికొందరు ‘అగ్గిపెట్టెల్లో కూడా ఇంతకంటే ఎక్కువ పుల్లలు పడతాయి’ అని కామెంట్ చేయగా.. ఒక రూమ్ ఉన్న ఫ్లాట్‌ను వన్ బిహెచ్‌కే పేరుతో విక్రయిస్తున్నారని మరికొందరు మండిపడ్డారు. ముంబై రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఒక భారీ సోషల్ ఎక్స్‌పెరిమెంట్ లాగా మారిపోయిందని పోస్ట్‌లో పేర్కొన్నారు.

?utm_source=ig_web_copy_link

ఈ పరిస్థితిపై సామాన్యులు ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు. బిల్డర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా, ప్రాంతాల వారీగా ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మధ్యతరగతి ప్రజలు ముంబైలో ఇల్లు కొనడం అసాధ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల సంఖ్యలో వ్యూస్ రాగా, ముంబై జీవన ప్రమాణాలు, రియల్ ఎస్టేట్ మాఫియాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ALSO READ: Davos-2026: దావోస్ వేదికపై సీఎం రేవంత్‌‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ విజన్-2047 ప్రదర్శన

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×