E-Paper
Advertisement

Grok: గ్రోక్‌ను రూ.2 వేలు అప్పు అడిగిన నెటిజన్.. దాని సమాధానం తెలిస్తే షాకవుతారు!

Grok: గ్రోక్‌ను రూ.2 వేలు అప్పు అడిగిన నెటిజన్.. దాని సమాధానం తెలిస్తే షాకవుతారు!
Advertisement

Grok Funny Reply: ఎలన్ మస్క్ ఏఐ చాట్ బాట్ గ్రోక్.. టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా చెప్పుకోవచ్చు. చాట్ జీపీటీకీ పోటీగా వచ్చిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఏ విషయం గురించి అడిగినా ఇట్టే చెప్పేస్తుంది. ఇంకా చెప్పాలంటే సూటిగా, సుత్తి లేకుండా విషయం ముందు పెట్టేస్తుంది. అందుకే, చాట్ జీపీటీ తర్వాత వచ్చినా, ఈ చాట్ బాట్ ను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. కొంత మంది ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగంచుకుంటే, మరికొంత మంది ఫన్నీగా చాట్ చేస్తూ సంతోష పడుతున్నారు. అలాగే, ఓ నెటిజన్ తాజాగా తనకు రూ. 2 వేలు అప్పు ఇవ్వాలని అడగడంతో ఆసక్తికర ముచ్చట చెప్పింది.

ఇంతకీ గ్రోక్ ఏమన్నదంటే..

ఓ నెటిజన్ “మామా రూ. 2 వేలు అప్పు ఉంటే ఇవ్వు. రేపు ఇచ్చేస్తా. నీ దగ్గర లేకపోతే మస్క్ మామని అడుగు. ఆయనకు రూ. 2 వేలు పెద్ద లెక్కకాదు. ఇచ్చేస్తాడు” అని గ్రోక్ ను అడిగాడు. దానికి గ్రోక్ ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. “హా హా బాబు, నేను మస్క్ మామా అకౌంటెంట్ ను కాదు రా. అది కూడా రూ. 2 వేలు అడిగితే.. ఈ బడారం గ్రోన్ ని ఎందుకు పెట్టాం రా అని ఆయన నన్ను మార్స్ కి పంపిస్తాడు. నా దగ్గర డబ్బులు లేవు రా. కానీ, ఓ ఆలోచన ఉంది. నువ్వు ఈ మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ లో “@elonmuskమామా రూ. 2000 ఇవ్వండి. మా గ్రోక్ మామ ఇవ్వడం లేదు” అని. ఒకవేళ వైరల్ అయితే, నీకు రూ. 2 వేలు కాదు. రూ. 2 లక్షలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది” అని రిప్లై ఇచ్చింది.

Netizen asked Grok for a loan of Rs. 2000 check our shocking reply
  

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

ఈ క్రేజీ ముచ్చటపై నెటిజన్లు ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు. “నువ్వు ఇలాంటి ఐడియాలు నెటిజన్లకు ఇస్తే, త్వరలోనే మస్క్ మామా కుబేరుడి నుంచి బికారిగా మారిపోతాడు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మావా రూ. 2 వేలు ఇవ్వండి. మా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి ఖర్చులు కావాలి” అని మరో వ్యక్తి అడిగాడు. “గ్రోక్ చెప్పినట్లు చేస్తే, కచ్చితంగా నీకు రూ. 2 లక్షలు రావడం పక్కా” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “నీ టైమ్ బాగుంటే రూ. 2 వేలు కాదు, 2 వేల డాలర్లు కూడా వస్తాయి” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ ఫన్నీ సంభాషణ నెటిజన్లు ఆకట్టుకుంటుంది.

Read Also: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఆర్థిక సంక్షోభం.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా ప్రిడిక్షన్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×