E-Paper
Advertisement

Akhanda 2 Postpone: రూ. 100 కోట్ల వెనక్కి ఇచ్చేయండి.. నిర్మాతలకు నట్టి కుమార్‌ షాక్‌!

Akhanda 2 Postpone: రూ. 100 కోట్ల వెనక్కి ఇచ్చేయండి.. నిర్మాతలకు నట్టి కుమార్‌ షాక్‌!
Advertisement

Natti Kumar on Akhanda 2 Postponed: అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ అఖండ 2 మూవీ వాయిదా పడటంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ప్రస్తుతం అంతా అఖండ 2 విడుదల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైనాన్షియల్‌ సమస్య కావడంతో ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలంత ఏకమైన సమస్యని పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి దీనిపై నిర్మాతలంత చర్చలు జరుపుతున్నారు. కానీ, అఖండ 2 విడుదలకు పరిష్కారం మాత్రం కావడం లేదు.

అఖండ 2 నిర్మాతలకు షాక్

మొత్తం డబ్బులు చెల్లించాల్సిందే అని బాలీవుడ్‌ ఏరోస్‌ ఫైనాన్స్‌ సంస్థ పట్టుదలకు పోతుంది. ఇలా అఖండ 2 రిలీజ్ అడ్డంగి తొలగించేందు తీవ్రం ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు నిర్మాత, డిస్ట్రీబ్యూటర్‌ కం ఎగ్జిబిటర్‌ నట్టి కుమారు రూ. 100 కోట్ల వెనక్కి ఇవ్వాలంటూ ఓ ప్రకటన విడుదల చేసి మూవీ టీంకి షాకిచ్చాడు. అఖండ 2 రిలీజ్ వాయిదా పడటం, కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టం రాకపోవడం ఇప్పటి వరకు డిస్ట్రీబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌ నోట్ విడుదల చేశారు. “అఖండ 2 డిసెంబర్‌ 6వ తేదీన కూడా రిలీజ్ కాకపోవడం అనుకోని పరిస్థితి. చివరి క్షణంగా మూవీ వాయిదా పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు.

రూ. 100 కోట్లు వెనక్కి ఇచ్చేయండి!

Advertisement

నేను ఒక ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రమేక కాకుండా మిగతా డిస్ట్రీబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నాతో మాట్లాడి తమ అభిప్రాయాలు, ఆందోళనలు నాతో పంచుకున్నారు. వారందరి తరపున నేను ఈ వినతి చేస్తున్నాను. సినిమా వాయిదా పడటం, కొత్త రిలీజ్‌ డేట్‌ ఇంకా ఖరారు కాకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరిగాయి. వారంత ఇచ్చిన మొత్తం రూ. 100 కోట్ల పైనే ఉంటుంది. దానికి భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి రావడం వంటి కారణాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కాబట్టి వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారిచ్చిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తే పెద్ద ఉపశమనం లభిస్తుంది. అందువల్ల దయచేసి ఎగ్జిబిటర్లు, డిస్ట్రీబ్యూటర్లకు వారు చెల్లించిన మొత్తాన్ని రేపటి (డిసెంబర్‌ 7) రేపటి లోగా రిఫండ్‌ చేయాలని మనవి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

అంతేకాదు ఈ నిర్ణయం వల్ల తెలుగు సినీ పరిశ్రమ ఒకటిగా నిలబడి.. ఒకరికి ఒకరం తోడుగా ఉంటామనే బలమైన సందేశాన్ని అందిస్తుందని, ఇది సంపూర్ణ ఐక్యతు చూపించే సందర్భంగా కూడా అవుతుందన్నారు. ఇప్పటికే రూ. 70 కోట్లు చెల్లించడానికి తనామునకలవుతున్న మూవీ మేకర్స్ నట్టి కుమార్‌ ట్వీట్‌ మరింత ఆందోళన కలిగిస్తుంది. కాగా 14 రీల్స్‌ బ్యానర్‌పై రామ్ ఆచంట – గోపి ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా పదేళ్ల క్రితం రిలీజైన 1 నెనొక్కడినే, ఆగడు చిత్రాల సమయంలో ఏరోస్‌ సంస్థ నుంచి ఫైనాన్స్‌ తీసుకున్న వీరు.. అవి కట్టకుండ బాకీలు పట్టారు. ఇప్పుడు బాకీలు వడ్డీ రూపంలో సుమారు రూ. 70 కోట్లపైనే అయ్యింది. అవి చెల్లించే వరకు అఖండ 2 రిలీజ్ ని ఒప్పుకోమంటూ ఏరోస్‌ సంస్థ డిమాండ్‌ చేస్తుంది.

Also Read: Bigg Boss 9 Promo: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో ఇమ్ము ఫౌల్ గేమ్… రీతు‌కు క్లాస్ పీకిన నాగ్

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×