E-Paper
Advertisement

Baba Vanga’s Prediction 2026: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఆర్థిక సంక్షోభం.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా ప్రిడిక్షన్!

Baba Vanga’s Prediction 2026: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఆర్థిక సంక్షోభం.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా ప్రిడిక్షన్!
Advertisement

బాబా వంగా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మన దగ్గర బ్రహ్మం గారి కాలజ్ఞానం లాగే బాబా వంగా భవిష్యత్ గురించి ఎన్నో అంచనాలు వేసింది. ఆమె జోస్యం చాలా వరకు నిజం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా నమ్ముతున్నారు. 2026 గురించి కూడా ఆమె కొన్ని అంచనాలు వేసింది. ఇంతకీ అవేంటి? ఏ విధంగా మానవాళికి ఇబ్బంది కలిగించబోతున్నాయి?

2026లో ఊహించని మార్పు

2026 సంవత్సరానికి సంబంధించి పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంకేతికత విషయంలో ఊహించని మార్పు ఉంటుందన్నారు. మానవ మనుగడకే పెను ముప్పుగా మారుతుందన్నారు. మానవ శక్తిని దాటి ముందుకెళ్లి, మానవుల మీదే తిరగబడే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో టెక్నాలజీ కారణంగా అనేక మంది రోడ్డు మీద పడే అవకాశం ఉందన్నారు. ఆమె అంచనాను బట్టి చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వివిధ రంగాలలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటుందని తెలుస్తోంది. AI టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వ్యాపారాలు, ఉద్యోగాలు, మానవ జీవితాలను మార్చే అవకాశం ఉంది.

బంగారం గురించి కీలక అంచనా

Advertisement

ప్రపంచ ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న బంగారం ధరల గురించి బాబా వంగా కీలక అంచనా వేసింది. 2026లో  ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక పతనాన్ని చూసే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుత బ్యాంకింగ్ నిర్మాణంలో తీవ్ర  అంతరాయాన్ని ఆమె ముందుగానే ఊహించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని అంచనా వేసింది. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుందని చెప్పుకొచ్చింది. ఎక్కువ డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, ఆర్థిక భయాల కారణంగా బంగారం ధరలు ఇప్పటికే పెరిగాయి. బాబా వంగా ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన అంచనా నిజమైతే, 2026 నాటికి ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు 25% నుంచి 40% వరకు పెరగవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. భారత్ లో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం, 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 1.25 లక్షలకు చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిజమైన బాబా వంగా అంచనాలు

ఇప్పటి వరకు బాబా వంగా వేసిన పలు అంచనాలు నిజమని నిరూపించబడ్డాయి. సోవియట్ యూనియన్ పతనం, అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడులు, చైనా అభివృద్ధి, ఉగ్రవాదం పెరుగుదల, సాంకేతిక పురోగతి, 2025 మయన్మార్‌  భూకంపం వంటి సంఘటనలను అంచనా వేశారు. ఇవన్నీ నిజమయ్యాయి. 2025లో యుద్ధం జరుగుతుందని అంచనా వేసింది. అది కూడా జరిగింది. పలు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి కూడా.

ఇంతకీ ఎవరీ బాబా వంగా?

Advertisement

బాబా వంగా  బల్గేరియాకు చెందిన ఓమహిళ. ఆమె అసలు పేరు వంగెలియా పాండేవా గుష్టెరోవా. అక్టోబర్ 3, 1911న ఒట్టోమన్ లో జన్మించింది. 12 సంవత్సరాల వయసులో తన కంటి చూపును కోల్పోయారు. ఆమె ఆగస్టు 11, 1996న 84 సంవత్సరాల వయసులో బల్గేరియాలో మరణించారు. భవిష్యత్ గురించి ఆమె ఎన్నో అంచనాలు వేసింది. వాటిలో చాలా వరకు నిజం అయ్యాయి.

Read Also: ఒక్క కాకి చనిపోతే వంద కాకులు వాలతాయ్, అది ఐక్యత కాదు.. అసలు సీక్రెట్ ఇదే!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×