E-Paper
Advertisement

Viral Video: రైలు వస్తుందని తెలియక పట్టాలపై రీల్స్ చేసిన భార్య భర్తలు.. షాకింగ్ వీడియో

Viral Video: రైలు వస్తుందని తెలియక పట్టాలపై రీల్స్ చేసిన భార్య భర్తలు.. షాకింగ్ వీడియో
Advertisement

Viral Video: ఈ రోజుల్లో రీల్స్‌ క్రేజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నంలో రీల్స్ చేయడానికి సాహసాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరి విశ్వ ప్రయత్నాలు చేసి కొంత మంది ఫేమస్ అవుతున్నా కూడా మరికొంత మంది మాత్రం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ తరుణంలో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. కొండలపై, రైలు పట్టాలపై, వివిధ వాహనాలపై సాహసాలు చేస్తూ చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగానే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది.

ఇద్దరు భార్యాభర్తలు కలిసి రైలు పట్టాలపై సరదాగా రీల్స్ చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ తరుణంలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు ఎంచక్కా బ్రిడ్జిపై ఉన్న రైలు పట్టాలపై నిల్చుని రీల్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో రైలు వస్తుందా లేదా అని ఆలోచించకుండా రీల్స్ చేయడంలో నిమగ్నమైపోయారు. దీంతో ఒక్కసారిగా రైలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. రైలు రావడం చూసిన భార్యాభర్తలకు ఏం చేయాలో తోచలేదు. దీంతో ఒక్కసారిగా రైలు నుంచి తప్పించుకునేందుకు ముందుగా భర్త ఒక్కసారిగా పట్టాలపై నుంచి కిందకు దూకాడు. ఇక భార్య మాత్రం అక్కడే భయంతో నిల్చుని ఉండిపోయింది. దీనిని గమనించిన రైలులోని వారు రైలుని నిలిపివేశారు.

Advertisement

దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇలా కనీసం రైలు పట్టాలపై నుంచి పక్కకు నిల్చునే స్థలం లేని చోట ఇలాంటి సాహసాలు చేయడం నిజంగా మూర్ఖత్వం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కనీసం రైలు వచ్చే విషయం కూడా తెలుసుకోకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం నేరం అని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మరికొంతమంది అంటున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×