BigTV English

Arshdeep Singh : “నాడు తిట్టినవారే.. నేడు పొగుడుతున్నారు”

Arshdeep Singh : “నాడు తిట్టినవారే.. నేడు పొగుడుతున్నారు”

Arshdeep Singh : అది 2022 టీ 20, ఆసియా కప్..
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ 18వ ఓవర్ జరుగుతోంది.
అప్పటికి పాకిస్తాన్ ఇంకా 33 పరుగులు చేయాలి.
ఓవర్ నాలుగో బంతిని ఆసిఫ్ ఆలీ గాల్లోకి లేపాడు.
అక్కడే ఫీల్డ్ చేస్తున్న అర్షదీప్ క్యాచ్ డ్రాప్ చేశాడు.
ఫలితంగా తర్వాత భువనేశ్వర్ కుమార్ వేసిన 19 ఓవర్ లో అదే ఆసిఫ్ ఆలీ ఒక ఫోర్, సిక్స్ కొట్టి, మ్యాచ్ ని పాక్ వైపు తిప్పేశాడు. ఆ ఓవర్ లో 17 పరుగులు వచ్చాయి.
చివరి ఓవర్ లో 8 పరుగులు చేయాలి. అర్షదీప్ ఆసిఫ్ ఆలీని అవుట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. పాకిస్తాన్ 19.5 ఓవర్లలో విజయం సాధించింది.


ఆ సమయంలో భువనేశ్వర్ కంట్రోల్ చేసినా ఫలితం ఉండేది. కానీ అందరి ద్రష్టి క్యాచ్ డ్రాప్ చేసిన అర్షదీప్ పైనే ఫోకస్ అయ్యింది. ఆ సమయంలో అర్షదీప్ ని నెటిజన్లు ఒకరకంగా ఆడుకున్నారు. విరాట్ కొహ్లీ లాంటివాళ్లు ఆటలో ఇలాంటివి సహజమని అర్షదీప్ వెనుక నిలిచారు. అదే తనని కాపాడింది. ఆనాడు తనమీద అరిచిన రోహిత్ శర్మ, నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇద్దరూ.. అవేవీ మనసులో పెట్టుకోకుండా 2024 టీ 20 ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేశారు. అప్పటికి ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్ లు ఆడి 19 వికెట్లు తీశాడు. కానీ టాప్ నుంచి 7వ ప్లేస్ లో ఉన్నాడు.

ఈ పరిస్థితిలో అర్షదీప్ ని టీ 20, 2024 ప్రపంచకప్ నకు ఎంపిక చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీ 20 ప్రపంచకప్ లో హయ్యస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. సిరాజ్ పక్కకెళ్లాడు. మెయిన్ బౌలర్ బుమ్రా వేయాల్సిన మ్యాచ్ ఫస్ట్ ఓవర్, లాస్ట్ ఓవర్ తనే వేసే గొప్ప అవకాశాన్ని అందుకున్నాడు. 8 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు తీశాడు. కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేవి. ఇన్నాళ్ల తర్వాత అర్షదీప్ తన మనసులో మాట వ్యక్తం చేశాడు.


Also Read : ఆర్సీబీ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ?

ఈ వరల్డ్ కప్ చిరస్మరణీయమని అన్నాడు. అభిమానుల నుంచి వస్తున్న ప్రశంసలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా నాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విమర్శించినవారే, నేడు అభినందిస్తుంటే నా గుండెల్లో బాధ తగ్గినట్టు ఉందని అన్నాడు.

అయితే ఇదే అత్యుత్తమం అని అనుకోను. నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానని అన్నాడు. క్రికెట్ జీవితంలో ప్రతీ ఆటగాడికి విమర్శలు సహజమని అన్నాడు. ఇన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు అందరినీ మెప్పించడం సాధ్యం కాదని అన్నాడు. ఇలాంటెన్నో అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ తరహాలో ఎక్కువ కాలం క్రికట్ ఆడాలని ఉందని అన్నాడు.

అయితే ఎల్లవేళలా, ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా దేశం కోసం ఆడుతున్నామనే స్ప్రహ ఒకటే మనసులో ఉండాలని అన్నాడు. లేదంటే ఆటలో ఏకాగ్రత కోల్పోతామని అన్నాడు. మన బలహీనత.. ప్రత్యర్థులకి బలంగా మారుతుందని అన్నాడు. నా కెరీర్ కష్టకాలంలో జట్టు సహచరులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ మద్దతుగా నిలిచారని, వారందరికీ ధన్యవాదాలని తెలిపాడు.

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×