India Pakistan War| భారత్, పాకిస్తాన్ దేశాలు ఒకరిపై మరొకరు క్షిపణులతో దాడులు చేసుకుంటున్న వేళ.. ఒక భారత సైనికుడి వీడియో తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ తో యుద్ధం ప్రారంభమైన కారణంగా భారత సైన్యం.. సెలవులో ఉన్న సైనికులందరినీ తిరిగి విధుల్లోకి రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెలవు ఫై ఉన్న ఒక జవాన్ తనకు ఆర్మీ నుంచి పిలుపు రావడంపై తన మనోభావాలను మీడియో ముందు వ్యక్తం చేశారు.
యుద్ధానికి వెళుతున్నారు. మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తావు? అని స్నేహితులు అడిగితే.. యుద్ధానికి వెళుతున్న అతను ఆ ప్రశ్నకు సమాధానంగా ఒక ఐస్ క్రీమ్ తింటూ ఇలా అన్నాడు. “నేను తిరిగి వస్తానో రానో? నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు నా దేశం క్షేమంగా, సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడైనా పాకిస్తాన్ .. భారత్ పై దాడి చేసిందని మీరు వింటే మీరందరూ ఒకటి గుర్తుంచుకోండి ఆ తరువాత మేము లాహోర్ కు వెళ్లి ఐస్ క్రీమ్ తింటాము.” అని దేశభక్తిని, శత్రువుని ఓడిస్తామని చెబుతూ ఇండియన్ ఆర్మీ బలంపై తన నమ్మకాన్ని పరోక్షంగా చాటి చెప్పాడు. భారత సైనికులు భయమెరగని వీరులని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండెంగ్ లో ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోని చూసిన నెటిజెన్లు భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల మనసుని ఈ వీడియో కదలిస్తోంది.
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్స్ ఈ జవాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇతడి మాటలు వింటే ఫుల్ జోష్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి జవాన్లు ఉండగా.. దేశానికి ఏ నష్టం రాదని పోస్ట్ లు చేస్తున్నారు. మరొక యూజర్ అయితే ఎదురుగా ఎవరు వచ్చినా భయం లేదు ఇలాంటి సింహం ఒకటి చాలు అని రాశాడు. యూజర్లందరూ భారత సైన్యం ధైర్య సాహసాలను కొనియాడుతున్నారు. ఇలాంటి సైనికుల ఇతర వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకరు యుద్ధానికి బయలుదేరుతూ తమ తల్లి ఆశీర్వాదం తీసుకుంటుంటే మరొకరు తమ కుటుంబానికి భావోద్వేగంగా వీడ్కోలు చెబుతున్నారు.
Also Read: బెట్ కాస్తున్నా ఇండియా గెలుస్తుంది.. అమెరికా ఫైటర్ పైలట్ పోస్ట్ వైరల్
మరోవైపు భారత సైన్యం అసమాన శౌర్యానికి ప్రతీకగా నిలిచింది ఆపరేషన్ సిందూర్. భారత త్రివిధ దళాలు ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి అధ్భుతమైన ధైర్యం, సమర్థత, అపారమైన నిబద్ధతను ప్రపంచానికి చాటి చెప్పాయి. దేశ భద్రతను మెరుగు పరచడం కోసం ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం సీరియస్‌గా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ పూర్తి చేసి భారత సైనికులు తమ అచంచలమైన దేశభక్తి, విధి పట్ల నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు.
ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై భారత పోరాటాన్ని ఎత్తిచూపుతూ.. శత్రువులకే కాక, ప్రపంచ దేశాలకు కూడా గట్టి సందేశాన్ని పంపింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని కించపరచాలని చూస్తే.. వారెవరైనా సరే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భారత సైన్యం చాటి చెప్పింది. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా.. వారిని వెతికి మరీ నిర్మూలించే సామర్థ్యం తమకు ఉందని స్పష్టంగా ఇండియన్ ఆర్మీ నిరూపించింది. శత్రుదేశంలో ప్రవేశించి మరిచి ఉగ్రవాద స్థావరాలన భారత సైన్యం కూలగొట్టింది. ఈ చర్య దేశ ప్రజలలో భారత సైన్యం పట్ల గట్టి నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపింది.
?igsh=MWJ5YTA4aGQ1ZHRoaw%3D%3D