BigTV English

India Pakistan War: బెట్ కాస్తున్నా ఇండియా గెలుస్తుంది.. అమెరికా ఫైటర్ పైలట్ పోస్ట్ వైరల్

India Pakistan War: బెట్ కాస్తున్నా ఇండియా గెలుస్తుంది.. అమెరికా ఫైటర్ పైలట్ పోస్ట్ వైరల్

India Pakistan War| ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో దాదాపు అన్ని దేశాలు.. భారత్‌కు బాసటగా నిలిచాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో ఒక అమెరికా పైలట్ భారత పక్షనే తాను నిలబడతానని ఆసక్తికరంగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.


వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాల పై భారత సైన్యం బుధవారం చేసిన వైమానిక దాడుల తరువాత అమెరికాకు చెందిన ఒక యుద్ధ పైలట్ డేల్ స్కార్క్స్‌ ఈ దాయాదుల పోరులో భారతదేశం పై చేయి సాధిస్తుందని కావాలంటే బెట్టింగ్ కాస్తానని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. రెండు దేశాల్లో ఏది గెలుస్తుందని ఎవరైనా తనను అడిగితే తన డబ్బులన్నీ ఇండియన్స్ పై బెట్ కాస్తానని ఆయన అన్నారు.

డేల్ స్టార్క్స్ అమెరికా ఎయిర్ ఫోర్స్ లో ఒక రిటైర్డ్ పైలట్. ఎ-10 థండర్ బోల్ట్ ఫైటర్ జెట్ విమానం నడపడంలో ఈయన ఎక్స్‌పర్ట్. అంతేకాదు ఆయన పాకిస్తాన్, భారత్ వాయు సైన్యాలతో కొంతకాలం కలిసి పనిచేశాడు. ఇరుదేశాల పైలట్ల పనితీరు స్టార్క్స్ కు బాగా తెలుసు. ఈ విషయాలన్నీ సంక్షిప్తంగా డేల్ స్టార్క్స్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.


“నేను నా కెరీర్ లో ఇరు దేశాల పైలట్లతో కలిసి పనిచేశాను. నేనైతే ఒక్కటే చెప్పగలను. నేను నా డబ్బులతో బెట్ కాయాల్సి వస్తే ఇండియన్స్ గెలుస్తారని చెబుతున్నా. యుద్ధం తీవ్రమైతే ఇండియన్స్ గెలుస్తారనే నా బెట్. ఎందుకంటే రెండు దేశాల సైన్యాలను పోలిస్తే.. ఇండియన్ ఆర్మీ చాలా బెటర్” అని ఆయన అన్నాడు.

అమెరికా పైలట్ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో చాలా మంది నెటిజెన్లు స్పందిస్తున్నారు. అందులో ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “ఇండియన్ పైలట్స్ పూర్తిగా ప్రొఫెషనల్స్. ఏం చేయాలో వారికి బాగా తెలుసు. వారేది చేసినా మతం అనే కోణంలో ఆలోచించి చేయరు. అతిగా స్పందించరు. పైగా ఇండియా చాలా విశాలమైనది. అక్కడ ఇతర సంస్కృతులను గౌరవించాలని నేర్పుతారు. ఇరువురిలో వారే ది బెస్ట్” అని రాశాడు.

Also Read: మనుషులపై దాడి చేసిన రోబో.. షాకింగ్ వైరల్ వీడియో

ఇంకొక యూజర్ అయితే.. “బ్రో నువ్వే కాదు. అందరూ ఇండియాపైనే బెట్ కాస్తారు. నేనైతే భారీ మొత్తంలోనే ఇండియాపై గెలుస్తుందని బెట్ కాసేశా” అని కామెంట్ లో రాశాడు. మరకొరైతే.. “భారత బలగాలు లక్షల కోట్ల రెట్లు బలంగా ఉంది. భారత సైనికులు చాలా క్రమశిక్షణతో, ఓర్పుతో.. ప్రొఫెషనల్ గా ఉంటారు. ఇండియన్ ఆర్మీ గర్జనకు పాకిస్తాన్ లో భూకంపాలు వస్తాయి. పాకిస్తాన్ కు ఇంకా అర్థం కాలేదు. వారు ఎవరితో పెట్టుకున్నరో” అని రాశాడు.

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ లో భారత్ వైమానిక దాడులు చేయడంతో తిరిగి పాకిస్తాన్ కూడా భారత్ లోని మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు మిసైల్స్ తో దాడి చేశాయి. కానీ వాటిని ఎక్కువ శాతం భారత డిఫెన్స్ సిస్టం ఎస్-400 ఆ పాకిస్తాన్ మిసైల్స్ ని గాల్లోనే పేల్చేసింది. ఆ తరువాత భారత ఫైటర్ జెట్లు లాహోర్ లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ని ధ్వంసం చేశాయి.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×