Kamal Haasan : లవ్ గురు మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న సినిమా థగ్‌లైఫ్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వీరి కాంబినేషన్లో సినిమా మొదలైంది అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి చాలా మంది పెద్దపెద్ద నటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అప్పట్లో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు కానీ కొన్ని కారణాలవల్ల అతను తప్పుకోవలసి వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన త్రిష కృష్ణన్ నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. అది ప్రస్తుతం పోస్ట్ పోన్ చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
వేడుకలకు ఇది టైం కాదు
మన దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు మరియు ప్రస్తుత హెచ్చరికల దృష్ట్యా, మే 16న జరగాల్సిన థగ్ లైఫ్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాము.
మన సైనికులు మన మాతృభూమి రక్షణలో అచంచల ధైర్యంతో ముందు వరుసలో నిలుచున్నందున, ఇది నిశ్శబ్ద సంఘీభావం కోసం సమయం అని నేను నమ్ముతున్నాను, వేడుకలకు కాదు. కొత్త తేదీని తరువాత, మరింత సరైన సమయంలో ప్రకటిస్తాము.
ఈ సమయంలో, మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సాయుధ దళాలలోని ధైర్యవంతులైన పురుషులు మరియు మహిళల పట్ల మన ఆలోచనలు ఉన్నాయి. పౌరులుగా, సంయమనం మరియు సంఘీభావంతో స్పందించడం మన విధి. వేడుకలు ఆలోచనకు దారితీయాలి.
Also Read : JVAS Movie : సీక్వెల్‌కి అతిలోక సుందరి తనయే అడ్డు… దర్శకేంద్రుడు నోటే ఈ మాట
ఆఫ్టర్ లాంగ్ టైం
మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ నటించిన నాయగన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీరిద్దరూ దాదాపు 37 సంవత్సరాలు తర్వాత కలిసి మళ్ళీ సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ మణిరత్నం కలిసి చాలా కథల గురించి చర్చించారట. వాటిలో కమల్ హాసన్ స్క్రిప్ట్ లో తన ఓల్డ్ ఐడియా ఒకటి మణిరత్నం కి విపరీతంగా నచ్చిందట. అయితే కమల్ హాసన్ ఇచ్చిన ఆ ఓల్డ్ ఐడియాతో మణిరత్నం ఒక కొత్త స్క్రిప్టును తయారు చేశాడట. కమల్ హాసన్ ఐడియాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మణిరత్నం తన సొంత రూట్ లో కథను తయారుచేసినట్లు కమలహాసన్ తెలిపారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Telugu Movies : ఆడియన్స్ అందరినీ పిచ్చోళ్లను చేశారు కదరా… కార్టూన్స్ చూసి కాపీ కొట్టే కర్మ మీకేంటి అసలు