War Movies in OTT : ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో ఇప్పటిదాకా ఓటీటీలో వచ్చిన బెస్ట్ వార్ డ్రామాలు ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ లిస్ట్ లో మొత్తం 18 సినిమాలు ఉండగా, అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి? తెలుగులో అందుబాటులో ఉన్నాయా లేదా? అనే విషయంపై లుక్కేద్దాం.
1. Guy Ritchie’s The Covenant (2023)
2018లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో, యూఎస్ ఆర్మీ సార్జెంట్ జాన్ కిన్లీ (జేక్ గిల్లెన్‌హాల్) తన బృందంతో తాలిబన్ ఆయుధాలను కనుగొనే పనిలో ఉంటాడు. ఒక దాడిలో కిన్లీ గాయపడగా, ఇంటర్ ప్రెటర్ అహ్మద్ అతన్ని తాలిబన్ నుండి రక్షించి సురక్షితంగా అమెరికాకు పంపిస్తాడు. కానీ అహ్మద్, అతని కుటుంబం తాలిబన్ల చెరలో చిక్కుకుంటుంది. ఋణం తీర్చేందుకు, ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వెళ్లి అహ్మద్ కుటుంబాన్ని రక్షించే ప్రమాదకరమైన మిషన్ లో పాల్గొంటాడు కిన్లీ.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
2. 1917 (2019)
ప్రపంచ యుద్ధం I (1917) సమయంలో, బ్రిటిష్ సైనికులైన స్కోఫీల్డ్ (జార్జ్ మాకే), బ్లేక్ (డీన్-చార్లెస్ చాప్‌మన్) శత్రు భూభాగంలోకి వెళ్లి, 1,600 మంది సైనికులను జర్మన్ ఉచ్చులో చిక్కుకోకుండా ఆపేందుకు ఒక సందేశాన్ని అందించాలి. సినిమా ఒకే షాట్‌లా కనిపించే సినిమాటోగ్రఫీతో ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు: Amazon Prime Video, Netflix
3. Hacksaw Ridge (2016)
ప్రపంచ యుద్ధం II సమయంలో, డెస్మండ్ డాస్ (ఆండ్రూ గార్ఫీల్డ్), ఆయుధాలు మోయడాన్ని నిరాకరించే సైనిక వైద్యుడిగా యూఎస్ ఆర్మీలో చేరతాడు. ఒకినావా యుద్ధంలో డాస్ ఒక షాట్ కూడా కాల్చకుండా, 75 మంది గాయపడిన సైనికులను శత్రు దాడుల మధ్య రక్షిస్తాడు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు : అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్
4. Saving Private Ryan (1998)
ప్రపంచ యుద్ధం IIలో, నార్మాండీ దాడి (1944) తర్వాత, కెప్టెన్ జాన్ మిల్లర్ (టామ్ హాంక్స్) నేతృత్వంలోని యూఎస్ ఆర్మీ రేంజర్స్ బృందం ప్రైవేట్ జేమ్స్ ర్యాన్‌ను (మాట్ డామన్) రక్షించే మిషన్‌లో వెళ్తుంది. ర్యాన్ ముగ్గురు సోదరులు యుద్ధంలో మరణించారు. అతన్ని సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని ఆర్మీ ఆదేశిస్తుంది. ఆ మిషన్ ఎలా జరిగింది అన్నది స్టోరీ.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు: అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్
5. Border (1997)
1971 ఇండో-పాక్ యుద్ధంలో, రాజస్థాన్‌లోని లాంగేవాలా పోస్ట్ దగ్గర జరిగిన రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన చిత్రం. మేజర్ కుల్దీప్ సింగ్ చంద్‌పూరి (సన్నీ డియోల్) నేతృత్వంలో 120 మంది భారత సైనికులపై, 2000 మంది పాకిస్తానీ సైనికులు దాడి చేస్తారు. ఒక రాత్రంతా సాహసంతో పోరాడి, భారత వైమానిక దళం రాకముందు పోస్ట్ ను కాపాడతారు. సినిమాలో దేశభక్తి, ధైర్యం, సైనికుల త్యాగం వంటి అంశాలు మెండుగా ఉంటాయి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు : అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5
6. Six Triple Eight (2024)
ప్రపంచ యుద్ధం II సమయంలో, 6888వ సెంట్రల్ పోస్టల్ డైరెక్టరీ బెటాలియన్ (ఆఫ్రికన్-అమెరికన్ మహిళల యూనిట్) యూరప్‌లో మెయిల్ డెలివరీ సమస్యను పరిష్కరించే మిషన్‌లో పాల్గొంటుంది. ఇందులో జాతి వివక్ష, యుద్ధ ప్రమాదాలు, లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొంటారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : నెట్ ఫ్లిక్స్
7. Full Metal Jacket (1987)
వియత్నాం యుద్ధం సమయంలో, యూఎస్ మెరైన్ జోకర్ (మాథ్యూ మోడిన్) ప్రయాణం శిక్షణ నుండి యుద్ధభూమి వరకు సాగుతుంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు : అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్
8. Lone Survivor (2013)
2005లో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. యూఎస్ నేవీ సీల్స్ బృందం తాలిబన్ నాయకుడు అహ్మద్ షాహ్‌ను హతమార్చే మిషన్ ఇది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
9. Ghazi Attack (2017)
1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. భారత నౌకాదళ జలాంతర్గామి INS కరంజ్ (S21), పాకిస్తాన్ జలాంతర్గామి PNS ఘాజీ మధ్య జరిగే ఫైట్ ఇది. కెప్టెన్ రణవిజయ్ సింగ్ (కేకే మీనన్), అతని బృందం (రానా దగ్గుబాటి, అతుల్ కులకర్ణి) విశాఖపట్నం తీరంలో ఘాజీని ముంచే మిషన్‌లో పాల్గొంటారు. ఈ సినిమా దేశభక్తి, వ్యూహాత్మక యుద్ధాన్ని చూపిస్తుంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు: అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 (తెలుగు).
Read also : మలయాళంలోనే బెస్ట్ సైకో కిల్లర్ మూవీ… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే?
10. The Hurt Locker (2008)
2004లో ఇరాక్ యుద్ధంలో యూఎస్ ఆర్మీ బాంబ్ డిస్పోజల్ బృందం బాగ్దాద్ లో పని చేస్తుంది. స్టాఫ్ సార్జెంట్ విలియం జేమ్స్ వల్ల టీం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది అన్నది కథ.
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో