E-Paper
Advertisement

Viral Video: బైకులకు రాడ్లు కట్టుకుని తిరుగుతోన్న పాకిస్తానీలు.. అక్కడ కూడా అదే సమస్య?

Viral Video: బైకులకు రాడ్లు కట్టుకుని తిరుగుతోన్న పాకిస్తానీలు.. అక్కడ కూడా అదే సమస్య?
Advertisement

Viral Video:  పాకిస్థాన్ కు చెందిన కొందరు ద్విచక్ర వాహనదారుల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులో కొందరు బైక్ బ్యాండిల్ దగ్గరా రెండు రాడ్ల (నిలబెట్టిన పొజిషన్ లో)ను అడ్డుగా పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. పాక్ లోని పలు ప్రాంతాల్లో చాలా మంది బైకర్స్ ఇలా ప్రయాణిస్తుండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వారందరూ ఎందుకలా తిరుగుతున్నారో అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.

మనకొచ్చిన సమస్యే..!

Advertisement

పాక్ పౌరులు ఇలా బైక్ పై రాడ్లు పెట్టుకొని ప్రయాణించడం వెనుక బలమైన కారణమే ఉంది. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ లో తలెత్తిన చైనా మాంజా సమస్య ప్రస్తుతం పాక్ లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి, మాసాల్లో పాక్ లోని పలు ప్రాంతాల్లో గాలిపటాలను ఎగురవేస్తుంటారు. అయితే ఇందుకోసం చైనా మాంజాను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. దీంతో పలువురు చైనా మాంజా మెడకు చుట్టుకొని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Advertisement

ముందు జాగ్రత్త కోసం..

చైనీస్ మాంజా బారి నుంచి తప్పించుకునేందుకు పాక్ పౌరులు ఈ విధంగా బైక్ ముందు భాగంలో నిలువుగా రాడ్లు పెట్టుకుంటున్నట్లు సమాచారం. తద్వారా చైనా మాంజా ఎదురుపడినా.. ముందుగా అది రాడ్లకు చిక్కుకొని.. తీవ్ర గాయాల నుంచి రక్షిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. దీంతో ఒకరిని చూసి మరొకరు ఈ విధంగా బైక్స్ కు రాడ్లు బిగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ కారణం చేతనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ తరహా వీడియోలు హల్ చేస్తున్నాయి.

Also Read: North Indian Chicken Korma: నార్త్ ఇండియన్ స్టైల్ మొఘలాయి చికెన్ కుర్మా.. ఇలా వండితే అందరూ మెచ్చుకోవాల్సిందే

హైదరాబాద్ లో ఇదే తరహాలో..

సంక్రాంతి సమయంలో హైదరాబాద్ లోనూ కొందరు ద్విచక్ర వాహనాదారులు ఇదే విధంగా బైక్ పై రాడ్లు బిగించుకొని వార్తల్లో నిలిచారు. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న చైనా మాంజా ఘటనల నుంచి తప్పించుకునేందుకు తాము ఇలా చేసినట్లు వారు చెప్పుకొచ్చారు. కాగా గత నెలలో హైదరాబాద్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో చైనా మాంజా ఘటనలు చోటుచేసుకున్నాయి. పదునైన దారం మెడకు చుట్టుకొని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరిద్దరు ప్రాణాలు సైతం కోల్పోయారు.

Also Read: Meta Oakley AI glasses: మెటా నుంచి నయా స్మార్ట్ గ్లాసెస్.. ధర ఏకంగా రూ.52,300.. ఎందుకంత స్పెషల్?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×