North Indian Chicken Korma: రాయల్ మొఘలాయి రుచి కలిగి ఉండే.. నార్త్ ఇండియన్ చికెన్ కుర్మా చాలా అద్భతంగా ఉంటుంద. జీడిపప్పు, పెరుగు మిశ్రమంతో తయారయ్యే గ్రేవీ, మెత్తని చికెన్ ముక్కలు కలిసిన ఈ వంటకం చపాతీ, రోటీ లేదా బిర్యానీలోకి అద్భుతమైన కాంబినేషన్. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా ఆదివారం ప్రత్యేకంగా ఏదైనా వండాలనుకున్నప్పుడు ఈ రెసిపీనిట్రై చేయడం ద్వారా మీరు రెస్టారెంట్ స్థాయి రుచిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. దీని సులభమైన తయారీ విధానం, కొన్ని చిట్కాలతో కూడిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నార్త్ ఇండియన్ చికెన్ కుర్మా.. తయారీ విధానం:
చికెన్ వంటకాల్లో కుర్మా అనేది ఒక ప్రత్యేకమైన కళ. సాధారణ చికెన్ కర్రీ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కారం కంటే మసాలాలు, పెరుగులోని పులుపు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే క్రీమీ రుచి ఎక్కువగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
చికెన్: 500 గ్రాములు
ఉల్లిపాయలు: 2 పెద్దవి
పెరుగు: 1 కప్పు (బాగా గిలకొట్టినది)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు/బాదం పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి/నూనె: తగినంత
మసాలాలు: దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, షాజీరా
పొడులు: ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చిటికెడు పసుపు, తగినంత కారం.
తయారీ విధానం:
1.ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి, అందులో పెరుగు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. దీనిని కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్క మెత్తగా తయారవుతుంది.
2. వేయించిన ఉల్లిపాయల మ్యాజిక్.. నార్త్ ఇండియన్ కుర్మాకు అసలైన రుచిని ఇచ్చేది ‘బరిస్టా’ లేదా వేయించిన ఉల్లిపాయలు. ఉల్లిపాయలను సన్నగా తరిగి నూనెలో గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి.
ALSO Read: బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే కర్ణాటక బటర్ దోస రెసిపీ!
3. ఒక లోతైన పాత్రలో నెయ్యి లేదా నూనె వేడి చేసి, హోల్ గరం మసాలా (లవంగాలు, ఇలాచీ, చెక్క) వేయాలి. అవి వేగాక మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి 5-8 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌పై ఉడికించాలి.
4. చికెన్ నుంచి నీరు బయటకు రావడం మొదలైనప్పుడు, అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
5. చివరగా తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత గరం మసాలా, కొత్తి మీర చల్లుకోవాలి. ఇష్ట పడే వారు ఒక చెంచా కేవ్రా వాటర్ వేస్తే అది మొఘలాయిల కాలం నాటి ఘుమ ఘుమలను ఇస్తుంది.