E-Paper
Advertisement

Viral Video: మెట్రో స్టేషన్లలో అండర్‌వేర్ వెండింగ్ మెషిన్స్.. ఇదెప్పుడు నుంచి మామ?

Viral Video: మెట్రో స్టేషన్లలో అండర్‌వేర్ వెండింగ్ మెషిన్స్.. ఇదెప్పుడు నుంచి మామ?
Advertisement

Undergarment Vending Machine Spotted At Metro Station: దేశంలోని పలు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. మెట్రో స్టేషన్లలో రక రకాల వ్యాపారాలు చేసుకునేందుకు మెట్రో అధికారులు అనుమతిస్తారు. ముఖ్యంగా ఫుడ్ కోర్టులు, పలు రకాల యాక్సెసరీస్ షాపులు, గిఫ్ట్ షాపులు కనిపిస్తాయి. కానీ, తాజాగా ఓ మెట్రో స్టేషన్ లో ఏకంగా అండర్ వేర్ వెండింగ్ మిషన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో అమ్మాయితో పాటు అబ్బాయిల అండర్ వేర్ లు ఉంచారు. తాజాగా ఓ నెటిజన్ ఈ మెషిన్ కు సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తే, మరికొందరు ప్రయాణీకులకు ప్రత్యేకంగా షాపింగ్ చేయాల్సిన ఇబ్బందిని తప్పించారని ప్రశంసిస్తున్నారు.

ఇంతకీ ఈ అండర్ వేర్ వెండింగ్ మెషిన్ ఎక్కడ ఉందంటే?

ఈ అండర్ వేర్ వెండింగ్ మిషన్ ఢిల్లీలోని రోహిణి ఈస్ట్ మెట్రో స్టేషన్‌ లో ఉంది. తాజాగా ఓ మహిళ ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. “.. నేను మెట్రో స్టేషన్ లో ఓ ఆసక్తికర విషయాన్ని చూశాను. ఇక్కడ అండర్ వేర్ లను వెండింగ్ మిషన్ లో అమ్ముతున్నారు. కానీ, మెట్రోలో వెళ్లి “ఓహ్, నేను ఇన్నర్ వేర్ మర్చిపోయాను, ఇక్కడ  కొనివ్వండి అని ఎవరు అంటారు?” అంటూ వీడియోలో నవ్వుతూ చెప్పింది.

Advertisement

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ వీడియో ఇన్‌ స్టాగ్రామ్‌ లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు సుమారు లక్ష వ్యూస్ వచ్చాయి. కొంతమంది వినియోగదారులు ఈ మెషిన్ ఏర్పాటును మెచ్చుకున్నారు. మరింత పెద్ద వెండింగ్ మెషిన్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. మరో యూజర్ దీని వల్ల మహిళలకు మంచి ఉపయోగడం ఉంటుందన్నారు. మరొక యూజర్ స్టేషనరీ,  కుట్టు ఐటెమ్స్ కూడా ఇందులో ఉంచాలని సూచించాడు. జపాన్ లాంటి దేశాలలో అవసరమైన వస్తువులతో కూడిన వెండింగ్ మెషీన్లు చాలా సాధారణంగా ఉంటాయి.

Advertisement

Read Also: ఆహా.. మలం అమ్ముకొని లక్షలు గడిస్తున్న యువకుడు, ఇంతకీ ఎవరు కొంటున్నారు?

ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నా ఉద్దేశ్యం ప్రకారం ఈ నిర్ణయం చాలా బాగుంది. మహిళలు అప్పుడు పీరియడ్స్ గురించి, మరకలు, లీకేజీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి మెషీన్స్ ద్వారా ఈజీగా అండర్ వేర్స్ కొనుగోలు చెయ్యొచ్చు” అని ఓ మహిళ కామెంట్ చేసింది. “లోదుస్తులు ధరించడం మర్చిపోయిన వ్యక్తుల కోసం కాదు. మీ ఆలోచన మార్చుకోవాలి. వేగంగా కదులుతున్న ప్రపంచంలో కొంతమందికి షాపింగ్ చేయడానికి సమయం దొరకకపోవచ్చు. వారి కోసం ఇలాంటి ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

Read Also:  రూ. 5 వేలతో ఉద్యోగం, ఇప్పుడు రూ. 3 కోట్ల ఇల్లు కొనేసింది.. హ్యాట్సాఫ్ హిమి!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×