E-Paper
Advertisement

Amaravati: రాజధానికి రాజముద్ర.. చట్టబద్ధత ఇంకెప్పుడు..?

Amaravati: రాజధానికి రాజముద్ర.. చట్టబద్ధత ఇంకెప్పుడు..?
Advertisement

Amaravati:  రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు. ప్రధాని మోడీ శంకుస్థాపనకు హాజరయ్యారు. అయినా ఏపీ క్యాపిటల్‌కు ఇంతవరకు చట్టబద్ధత రాలేదు. ఇప్పుడు మరోసారి అధికారలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చొరవతో.. అమరావతికి అధికారిక గుర్తింపు తెచ్చే ప్రక్రియ వేగవంతమైంది. అందుకోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఇప్పటికే సవరణ బిల్లుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదిస్తే.. అమరావతికి అధికారిక రాజధానిగా చట్టబద్ధత వస్తుందని, ఇక తర్వాత ఎవరూ అమరావతికి అడ్డం పడలేరంటున్నారు.

అమరావతికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాజధాని ఉండాలని అమరావతికి శంఖుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి రాజధానిగా చేయాలని.. అమరావతికి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. కానీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని అని ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలో లేదు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో సవరణ చేయడానికి ఇప్పటికే కేంద్రం న్యాయ శాఖ అమోదం తెలిపింది.

కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉన్న సవరణ బిల్లు

Advertisement

ఈ సవరణ బిల్లు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొంది.. ఈ నెలలోనే పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా దాదాపు ఐదేళ్లుగా స్తంభించిపోయిన అమరావతి రాజధాని చట్టబద్ధత ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి.

పునర్వవస్థీకరణ చట్టం సవరణకు కేంద్రం న్యాయ శాఖ అమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారికంగా చట్టబద్ధత కల్పించేందుకు ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 5(2)ను సవరించాలి. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. న్యాయ శాఖ ఆమోదం పొంది.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి బిల్లు సిద్ధంగా ఉంది. కాగా, 2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చింది. అయితే దీన్ని ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేసి.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక, ఏకైక రాజధానిగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

అమరావతి రాజధానికి చట్టబద్ధత దిశగా కీలక అడుగులు

Advertisement

ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో పలుమార్లు చర్చించారు. దీంతో అమరావతి చట్టబద్ధత ప్రక్రియ వేగం పుంజుకుంది. కాగా, ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని అమరావతి ఉంటుందా లేదా అమరావతి రైతులను ఇన్ని రోజులు వెంటాడింది. రాష్ట్ర ప్రజల్లో కూడా ఇదే సందేహం ఉంది. ఎట్టకేలకు రాజధాని చట్టబద్ధతకు అడుగులు పడుతున్న వేళ అమరావతి రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భూసేకరణ తప్పదు.. సీఎం చంద్రబాబు స్పష్టం

ఇదిలా ఉండగా, అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు రెండో దశ భూసేకరణ తప్పదని ఇటీవల సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులు, ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌సిటీ వంటి వాటికి భూములు అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రెండో దశ భూసేకరణకు సంబంధించి చర్చించారు. 7 గ్రామాల పరిధిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర కేబినెట్. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 20 వేల ఎకరాలు సేకరించాలని మంత్రివర్గం నిర్ణయించారు.

విచిత్ర పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలో లేని విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని ఇప్పటివరకు ఏపీకి రాజధాని అంటూ లేని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పటికీ.. అన్ని విషయాల్లోనూ తమను బుల్ డోజ్ చేస్తారని ఆంధ్రోళ్ల మీద అదే పనిగా విరుచుకుపడే వారు.. అయినా అప్పట్లో ఆంధ్రోళ్లు తమదైన రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగానే మనుగడ సాధిస్తుండటం చర్చనీయాంశంగా మారింది

ప్రభుత్వాలు మారాయి.. రాజధాని వివాదం మారలేదు

విభజన తర్వాత 2014లో కొలువు తీరిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొంటూ హడావుడి చేసినప్పటికి సాంకేతికంగా.. చట్టబద్ధంగా మాత్రం అమరావతికి రాజధాని గుర్తింపు లభించలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని అంశంపై తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన తీరుతో రాజధాని అన్నది పెద్ద వివాదంగా మారింది. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. రాజధానిగా చెబుతున్న అమరావతికి ఇప్పటివరకు కేంద్రం గుర్తింపు రాని పరిస్థితి.

అమరావతి రాజధానిపై కేంద్రానికి ఏపీ జవాబు…

అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ దానికి చట్టబద్ధత కల్పిస్తూ చట్టాన్ని సవరించాలని కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వానికి డిసెంబరు ఒకటిన లేఖ రాసింది. దీంతో 2024 జూన్ 2 నుంచి ఏపీ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని కోరుతూ కేంద్రానికి జవాబు ఇచ్చారు. విభజన సవరణ బిల్లు ఆమోదం పొంది.. కేంద్రం అందుకు తగ్గట్లు ఉత్తర్వులు జారీ చేస్తే ఎంతమంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా.. అమరావతిని ఏపీ రాజధాని కాకుండా ఆపలేరని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు.

బిల్లు పెట్టించి ఆమోదింప చేస్తామంటున్న పెమ్మసాని

అమరావతికి రాజధాని హోదా 2014 నుంచి ఇవ్వాలా? 2024 నుంచి ఇవ్వాలా? అన్నది టెక్నికల్ అంశమని.. దీనికి సంబంధించిన క్లారిటీని ఏపీ ప్రభుత్వాన్ని అడిగినట్లు చెప్పిన పెమ్మసాని.. ఈసారి సమావేశాల్లో కాకున్నా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అయినా దీనికి సంబంధించి బిల్లు పెట్టి ఆమోదిస్తామని స్పస్టం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తూ అమరావతిని నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంతో కొత్త సంవత్సరంలో ఏపీ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు లభిస్తుందన్న ఆశాభావం అందరిలో వ్యక్తమవుతోంది.

 Story by Ramireddy,  Big Tv 

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×