E-Paper
Advertisement

Student Suicide: పిల్లి పెట్టిన చిచ్చు.. సూసైడ్ చేసుకున్న ఎంబీబీఎస్ విద్యార్దిని..!

Student Suicide: పిల్లి పెట్టిన చిచ్చు.. సూసైడ్ చేసుకున్న ఎంబీబీఎస్ విద్యార్దిని..!
Advertisement

Student Suicide: స్వేచ్ఛ బ్యూరో: పెంపుడు పిల్లి విషయంలో కుటుంబంలో తలెత్తిన గొడవ కూతురి ప్రాణాలను బలికొంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. రిసాల బజార్ లోని శివం ప్రైడ్ అపార్ట్మెంట్స్‌లో నివాసం ఉంటున్న కుసుమలత, దేవ దత్తంలు ఎంబిబిఎస్ చదువుతున్న తమ కూతురు తుమ్మల ప్రిన్సి శ్రేష్ఠతో కలిసి నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్నాళ్లుగా ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో తల్లిదండ్రులకు విద్యార్థినికి(కూతురికి) మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ భార్య బ్యాగ్రూండ్ ఇదే.. వామ్మో మామూలు రికార్డు కాదు..

పిల్లిని పెంచుకునే విషయమై..

Advertisement

పెంపుడు పిల్లిని పెంచడం మంచిది కాదని తమ కూతురు తుమ్మల ప్రిన్సి శ్రేష్ఠకు తల్లిదండ్రులు పలుమార్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. పిల్లిని పెంచుకునే విషయమై తల్లి దండ్రులు వారించడంతో మనస్థాపానికి గురైన తుమ్మల ప్రిన్సి శ్రేష్ఠ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వాళ్లు పని నిమిత్తం ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ప్రిన్సి శ్రేష్ట ఉరి వేసుకుని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also read: Sports Budget: తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి 9 కీలక ఓప్పందాలు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×