BigTV English

Puneet Superstar: ముఖానికి పేడ, నోట్లో మూత్రం.. ఇదేం పైత్యం గురూ, ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ వేషాలు చూశారా?

Puneet Superstar: ముఖానికి పేడ, నోట్లో మూత్రం.. ఇదేం పైత్యం గురూ, ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ వేషాలు చూశారా?

Puneet Superstar Viral Video: పునీత్ సూపర్ స్టార్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మాంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, బిగ్ బాస్(హిందీ) OTT సీజన్ 2లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసే వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కొత్త కొత్త కాన్సెప్ట్ తో ఆయన చేసే వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి తీవ్ర విమర్శలకు గురవుతాయి. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో చూసి అందరూ ఇదేం పోయే కాలం రా అయ్యా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆయన షేర్ చేసిన వీడియోలో ఏం ఉందంటే?


ముఖానికి పేడ, నోట్లో మూత్రం

తాజాగా పునీత్ సూపర్ స్టార్ గోశాలలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం చడ్డీ వేసుకుని నేల మీద కూర్చొని వేడి వేడి బర్రె పేడను ముఖానికి పూసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. కాసేపటి తర్వాత బర్రె మూత్రం పోస్తుంటే, దాహం వేసిన వాడిలా గబ గబా తాగేశాడు. బర్రెల కొట్టంలో పడుకొని పొర్లాడుతూ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాసేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యాయి. బోలెడు మంది షేర్ చేశారు. లక్షల్లో లైకులు వచ్చాయి.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by prakash kumar (@puneetsuper_starrrr)

బండబూతులు తిడుతున్న నెటిజన్లు

పునీత్ సూపర్ స్టార్ వీడియోలు చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఇవేం పనులు అంటూ అసహ్యించుకుంటున్నారు. పునీత్ వీడియోల్లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అది మరింత శృతిమించిదంటూ మండిపడుతున్నారు. ఆకలికి తట్టుకోలేక పునీత్ బర్రె పేడ తింటూ, మూత్రం తాగాడని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆయన కంటెంట్ ను కాపీ కొట్టడం మరెవరికీ సాధ్యం కాదంటూ ఇంకొకరు వ్యాఖ్యానించారు. రోజు రోజుకు ఈ మనిషి మానసిక స్థితి దిగజారుతోందంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. లైకులు, షేర్ల కోసం బర్రె పేడ మాత్రమే కాదు, మనిషి మలం కూడా తినేందుకు వెనుకాడడని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలకు గుర్తింపు రావాలంటే చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు. మంచి పనులు చేసినా ఆదరిస్తారని ఇంకొందరు హితవు పలుకుతున్నారు.

చెత్త వీడియోలకు కేరాఫ్ అడ్రస్ పునీత్

గత కొంతకాలంగా పునీత్  సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు దాదాపు నెటిజన్లకు చిరాకు కలిగిస్తున్నాయి.  ఈ మధ్య మరీ చెత్త వీడియోలను షేర్ చేస్తున్నాడు. చూడ్డానికే చిరాకు కలిగించే వీడియోలు చేసి సోషల్ మీడియాలోకి డంప్ చేస్తున్నాడు. నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలు చూసి అయినా పునీత్ సూపర్ స్టార్ మారితే బాగుటుంది. లేదంటే, ఇలాంటి తిట్లు తినాల్సి ఉంటుంది. అన్నట్లు పునీత్, అసలు పేరు ప్రకాష్ కుమార్. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మీద అభిమానంతో ఆయన పేరు పెట్టుకున్నట్లు బిగ్ బాస్  షోలో చెప్పాడు. అలాంటి వ్యక్తి పేరు పెట్టుకుని ఇలాంటి పనులేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

Read Also: ఔనా, నిజమా.. ఇద్దరు వ్యక్తులు కలలో కమ్యునికేట్ చేసుకోవచ్చా? ఇవిగో ఆధారాలు

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×