BigTV English

Rapido Driver Viral Video: అయ్యోపాపం ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!

Rapido Driver Viral Video: అయ్యోపాపం ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
Rapido driver

Rapido Bike Viral Video in Hyderabad: దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ట్రిప్ అనేది తక్కువ ధరకు లభించడం వల్ల అందరూ ‘రాపిడో’ బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు.


అయితే తాజాగా ఓ ర్యాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయినా కస్టమర్‌ బైక్ దిగకపోవడంతో అలానే తోసుకుంటూ వెళ్లాడు.ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే జరిగింది. ఇది చదివితే మీకు కచ్చితంగా ఆశ్యర్యం కలుగుతుంది. ఈ కథేంటో తెలుసుకుందాం రంది.

హైదరాబాద్ మహానగరంలో ఒకచోటి నుంచి మరొక చోటికి వెళ్లాలంటే ఏదైనా వాహనం ఉండాలి.ముఖ్యంగా వివిధ ఉద్యోగాలు చేసే వారికి వాహనాలు చాలా అవసరం. హైదరాబాద్‌లో ఒక చోటనుంచి మరొక చోటికి ప్రయాణించడానికి మెట్రో,లోకల్ ట్రైన్,లోకల్ బస్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఎక్కువగా రాపిడో యాప్‌లో బుక్ చేసుకొని బైక్‌పై వెళ్తుంటారు.


Read More: పాములతో వైన్ తయారీ..!

రాపిడో సంస్థ కింద వేలాదిమంది బైకర్లు కమీషన్ పద్ధతిలో పని చేస్తూ ఉంటారు. అయితే ఈ రాపిడో లో పని చేసే ఒక బైకర్‌‌కు విచిత్రమైన అనుభం ఎదురైంది. అదేంటో చూసేద్దాం.

హైదరాబాద్ మహానగరంలో ఓ ఉద్యోగి రాపిడో యాప్ ద్వారా బైక్‌ను బుక్ చేశాడు. ఆ బైకర్ బుక్ చేసుకున్న ప్రయాణికుడిని తన స్కూటీపై ఎక్కించుకున్నాడు. కానీ కొంత దూరం వెళ్లగానే అతడి స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. ఇదే విషయాన్ని కస్టమర్‌కు చెప్తే అతడు ఒప్పుకోలేదు.

బండి దిగండి పెట్రోల్ కొట్టించుకుని వస్తానని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. నేను స్కూటీ మీద అలానే ఉంటాను నువ్వు తోసుకొని వెళ్లాలని చెప్పాడు. దీంతో వేరే మార్గం లేక ఆ రాపిడో బైకర్ ఆ ఉద్యోగిని అలానే కూర్చోబెట్టుకొని దగ్గరలోని పెట్రోల్ బంక్ వరకు తోసుకుని వెళ్లాడు.

Read More: అరేయ్ ఏంట్రా ఇది.. కొంచె అటూ ఇటూ అయితే?

ఈ ఘటనను చూసిన కొందరు.. వారి ఫోన్లలో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆ ఉద్యోగిని మానవత్వం లేదని కొందరంటే.. పెట్రోల్ చూసుకోవాల్సిన బాధ్యత రాపిడో బైకర్‌కు లేదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మీ అభిప్రాయం ఎంటో కామెంట్ చేయండి.

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×