Seshachalam Forest: ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణానికి సంబంధించి వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి. కొంచెం ముందుగానే వర్షాలు దంచికొట్టాయి. వారం రోజుల క్రితం దేశ వ్యాప్తంగా వానలు కురిశాయి. అయతే వర్షాకాలం ప్రారంభం కావడంతో అడువుల్లో కొత్త కొత్త జీవులు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా తూర్పు కనుమల్లో విస్తరించిన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ పాములా కనిపించే వింత జీవి బయటపడింది. దీంతో ఈ జీవికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు ఈ జీవిపై స్పందించారు. ఇది ఒక అరుదైన, కొత్త జాతికి చెందిన నలికిరి (స్కింక్) కి చెందిన జీవిగా చెబుతున్నారు. అయితే ఈ కొత్తగా కనుగొనబడిన ఈ స్కింక్ జాతికి చెందిన జీవికి డెక్కన్ గ్రాసైల్ స్కింక్.. సైంటిఫిక్ అని నామకరణం చేసినట్టు ప్రముఖ సైంటిస్ట్ బెనర్జీ తెలిపారు. జీవి చూడటానికి అచ్చం పామును పోలి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ దీనికి కొంచెం కనురెప్పలు, శరీరంపై విభిన్నమైన చారలు ఉన్నట్టు వారు గుర్తించారు. కొంచెం పాలపందేలా కూడా ఉందని వారు పేర్కొన్నారు.
ALSO READ: Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త!
ఈ అరుదైన జీవులు ఏపీలోని శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు ఇటు తెలంగాణలోని అమ్రాబాద్ అభయారణ్యంలో అక్కడక్కడా కనిపిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే ఈ జీవి మనుగడకు ఈ తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ప్రాంతాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉందని వారు చెప్పారు.
ALSO READ: UPSC Recruitment: డిగ్రీతో యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం రూ.2లక్షల పైనే
అయితే.. పామును పోలిన ఈ జీవి గురించి పరిశోధనల్లో.. జెడ్ఎస్ఐకి చెందిన హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం, కోల్‌కతాలోని రెప్టిలియా విభాగం సైంటిస్టులతో పాటు లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. దీని గురించి జెడ్ఎస్ఐ ప్రతినిధి డాక్టర్ దీపా జైస్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే.. తూర్పుకనుమల రిజర్వ్ అడవులు, ఆమ్రాబాద్ అడవుల్లో మరింత లోతుగా జీవవైవీధ్యం గురించి పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని సైంటిస్టులు తెలిపారు.