Telangana Gaddar Film Awards-2024 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పటికీ కూడా ఆ సినిమాలోని డైలాగ్స్ విపరీతంగా పాపులర్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలోని డైలాగ్స్ ను క్రికెటర్స్ పొలిటిషన్ చెప్పడం వలన ఆ సినిమాకి ఇంకొంత హైప్ వచ్చింది. అలానే ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక పుష్ప టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి కూడా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలిచింది.
పుష్ప 2 సినిమాకు అవార్డ్
అల్లు అర్జున్ నటన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతని మీద పర్సనల్గా ఎంత ట్రోలింగ్ నడిచిన కానీ యాక్టింగ్ విషయానికి వస్తే అద్భుతంగా చేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం సినిమాల్లోనే కాకుండా ఆన్ స్టేజ్ పై కూడా అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్ అని ఒక కామెంట్ వినిపిస్తూ ఉంటుంది. పుష్ప 2 సినిమా విషయంలో అనేక వివాదాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడంపై విపరీతమైన నెగిటివిటీ అల్లు అర్జున్ మీద వచ్చింది. ఆ తరుణంలో సక్సెస్ మీట్ పెట్టడం కూడా ఒక నెగిటివిటీ తీసుకొచ్చింది. అలానే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు.
ఇప్పుడు మాత్రం అందర్నీ గుర్తుపెట్టుకున్నారు
ఇక అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు అందరకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. అలానే ఈ అవార్డు రావడానికి కారణమైన సుకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా స్టేజ్ పైన ఎవరు అడక్కుండానే పుష్ప లోని సినిమా డైలాగ్ చెప్పాడు. మామూలుగా డైలాగులు చెప్పమని అభిమానులు అడుగుతూ ఉంటారు. కానీ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పేసాడు. ఇలాంటి విషయాలే కొన్నిసార్లు చాలామందికి అతిగా అనిపించి ట్రోల్ చేస్తూ ఉంటారు.
Also Read : Anirudh : కావ్య మారన్ తో పెళ్లిపై స్పందించిన అనిరుధ్