BigTV English

OTT Movie : మొగుడు పోయిన దుఃఖంలో తల్లి … బాయ్ ఫ్రెండ్ ని ఏసేసె కూతురు … ట్విస్టులతో మెంటలెక్కించే సినిమా

OTT Movie : మొగుడు పోయిన దుఃఖంలో తల్లి … బాయ్ ఫ్రెండ్ ని ఏసేసె కూతురు … ట్విస్టులతో మెంటలెక్కించే సినిమా

OTT Movie : పెన్సిల్వేనియా లోని ఒక నిర్మానుష్యమైన పచ్చని లోయలో, కేట్ గారెట్సన్ అనే మహిళ తన గుర్రపు శిక్షణ కేంద్రంలో ఒంటరిగా ఉంటుంది. గతంలో తాను పడ్డ బాధలను గుర్తుచేసుకుంటూ ఉంటుంది. హఠాత్తుగా ఆమె ఇంటి బయట పెంపుడు కుక్క ఒక్కసారిగా మొరగడం మొదలుపెడుతుంది. ఆమె గుండె కూడా ఒక్కసారిగా ఆగినట్లు అవుతుంది. ఎవరో ఆమె ఇంటిలోకి చొరబడిన శబ్దం వినిపిస్తుంది. ఆమె అక్కడ  చీకటిలో ఒక రూపాన్ని చూస్తుంది. అది ఎవరో కాదు ఆమె కూతురు క్లైర్. తను భయంతో వణుకుతూ, ఒళ్లంతా రక్తంతో తడిసి ఉంటుంది.  ఇప్పుడు కేట్‌కు ఒక భయంకర నిజం తెలుస్తుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇంతకీ ఆ రక్తం ఎవరిది ? కేట్‌కు తెలిసిన నిజం ఏమిటి ? ఈ మూవీ పేరు, ఓటీటీ వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

కేట్ గారెట్సన్ పెన్సిల్వేనియాలోని ఎకో వ్యాలీలో ఒక గుర్రపు శిక్షణ కేంద్రాన్ని నడుపుతూ ఉంటుంది. ఆమె భర్త ప్యాటీ మరణించిన తర్వాత ఒంటరితనంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె రోజూ ఉదయం ప్యాటీ పాత వాయిస్‌మెయిల్స్‌ను వింటూ, గతంలోని జ్ఞాపకాలతో జీవిస్తుంది. ఆమె నడుపుతున్న శిక్షణ కేంద్రం ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. బర్న్ రూఫ్ రిపేర్ చేయడానికి కూడా డబ్బులు ఉండవు. ఆమె మాజీ భర్త రిచర్డ్ ఆమెకు ఆర్థిక సహాయం చేస్తాడు. కానీ వారి సంబంధం ఒకప్పుడు ఉన్నట్టుగా ఉండదు. అయితే ఒక రోజు రాత్రి, కేట్ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఆమె కూతురు క్లైర్ ఒక డ్రగ్ అడిక్ట్. భయంతో వణుకుతూ, ఒళ్లంతా రక్తంతో తడిసి ఆమె ఇంటి గుమ్మంలో కనిపిస్తుంది. క్లైర్ తన బాయ్‌ఫ్రెండ్ ర్యాన్ తో జరిగిన ఒక భయంకర సంఘటన గురించి తల్లికి చెబుతుంది. ఆమెకు సహాయం కావాలని వేడుకుంటుంది.


ఒక డ్రగ్ అడిక్ట్ అయిన క్లైర్, తన తల్లి దగ్గరికి వచ్చి వెళుతూ ఉంటుంది. ఎప్పుడూ సమస్యలను తెచ్చిపెడుతుంది. కేట్, తన కూతురు పట్ల అపారమైన ప్రేమతో, ఆమెను రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అయినప్పటికీ క్లైర్ ప్రవర్తన ఆమెను ఎప్పుడూ బాధపెడుతుంది. క్లైర్ ఆమె బాయ్‌ఫ్రెండ్ ర్యాన్‌తో జరిగిన ఒక ప్రమాదం గురించి కేట్ కి చెప్తుంది. ఈ ప్రమాదంలో ర్యాన్‌ చనిపోయి ఉంటాడు. కానీ ఆమె మాటలు నిజమా లేక అబద్ధమా అనేది స్పష్టం కాదు. కేట్ తన కూతురిని నమ్ముతూ, ఆ శవాన్ని దాచడం కోసం ప్రయత్నిస్తుంది. ఈ నిర్ణయం ఆమెను ఒక నేరపూరిత కుట్రలోకి లాగుతుంది. ఇందులో జాకీ అనే ఒక డ్రగ్ డీలర్ ప్రమాదకరమైన పాత్ర పోషిస్తాడు. కేట్ స్నేహితురాలు లెస్లీ ఆమెకు మద్దతుగా నిలుస్తుంది. కానీ కేట్ నిర్ణయాలు ఆమె జీవితాన్ని, ఆమె కూతురి జీవితాన్ని మరింత ఇబ్బందుల్లో పడేస్తాయి.

సినిమా మొదట ఒక ఫ్యామిలీ డ్రామాగా మొదలై, క్రమంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుంది. కేట్ తన కూతురిని రక్షించడానికి తీసుకున్న నిర్ణయాలు ఆమెను ఒక క్రిమినల్ ప్రపంచంలోకి లాగుతాయి, ఇందులో జాకీ వంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఆమెను బెదిరిస్తారు. కేట్ తన ఆర్థిక సమస్యలతో పోరాడుతూనే, ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి కేట్ తన కూతుర్ని కాపాడుకుంటుందా ? క్లైర్ బాయ్ ఫ్రెండ్ చావుకి అసలు కారణం ఏమిటి ? డ్రగ్ డీలర్ ఎందుకు బెదిరిస్తున్నాడు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : 60 ఏళ్ల వయసులో రాత్రి పూట ఆ పని … ఇతని కథలు మామూలుగా లేవయ్యా సామీ

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎకో వ్యాలీ’ (Echo Valley) . 2025 జూన్ 6న యునైటెడ్ స్టేట్స్, కెనడాలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ అయింది. మైకేల్ పియర్స్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.  జూన్ 13 నుంచి Apple TV లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్కాట్ ఫ్రీ ప్రొడక్షన్స్, ది వాల్ష్ కంపెనీ కలసి నిర్మించాయి.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×