BigTV English

Viral Video: వీళ్ల ముందు ‘ధూమ్’ స్టంట్లు దిటదుడుపే.. ఏకంగా కదులుతున్న రైళ్ల మీదే..

Viral Video: వీళ్ల ముందు ‘ధూమ్’ స్టంట్లు దిటదుడుపే.. ఏకంగా కదులుతున్న రైళ్ల మీదే..

సోషల్ మీడియాలో పాపులర్ కావాలంటే.. భిన్నంగా ఆలోచించాలి. ఎవరికీ సాధ్యం కాని స్టంట్లు చేయాలి. అప్పుడే ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఇదే పని చేస్తున్నారు. ఎలాగైనా పాపులర్ కావాలంటూ రిస్కీ స్టంట్లు చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే. వారి స్టంట్లు చూస్తే మతిపోవాల్సిందే. ఇంతకీ అసలు ఏం చేస్తున్నారంటే..


రైళ్ల మీద డేంజరస్ స్టంట్లు

తరచుగా రైల్వే స్టేషన్లలో కుర్రాళ్లు స్టంట్లు చేస్తుంటారు. వేగంగా వెళ్లే రైళ్లలో వేలాడుతూ కనిపిస్తారు. కొన్నిసార్లు కిందపడిపోయి చనిపోయిన ఘటనలూ చూశాం. అయినప్పటికీ, బాగా పాపులర్ అయ్యేందుకు స్టంట్లు చేస్తూనే ఉన్నారు. అయితే, ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడంతో పాటు ప్రాణాలకు హాని కలిగించే స్టంట్లు చేయడాన్ని భారతీయ రైల్వే సీరియస్ గా తీసుకుంటున్నది. ఇలాంటి స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఇండియాలో రైళ్లలో స్టంట్లు చేయాలంటేనే భయపడుతున్నారు. అయితే, విదేశాల్లో చాలా మంది కుర్రాళ్లు రైళ్ల మీద స్టంట్లు చేస్తున్నారు. అంతేకాదు, భారత్ కు చెందిన కొంత మంది యూట్యూబర్ లు బంగ్లాదేశ్ లాంటి పొరుగు దేశాలకు వెళ్లి అక్కడ స్టంట్లు చేస్తున్నారు.


కదులుతున్న రైలు మీద అదిరిపోయే స్టంట్లు

ఇక తాజాగా జూలియన్ క్రూజ్ అనే ఇన్ స్టా అకౌంట్ ద్వారా షేర్ చేయబడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇద్దరు యువకులు ఫ్లై ఓవర్ మీది నుంచి కదులుతున్నన రైలు మీద దూకడంతో పాటు దాని మీద పరిగెత్తడం అందరూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇద్దరు యువకులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద ఉంటారు. అదే సమయంలో దాని కింది నుంచి రైలు వెళ్తుంది. ఒక్కసారిగా ఇద్దరు యువకులు పుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి వేలాడుతూ రైలు మీదికి దూకుతారు. ఆ తర్వాత రైలు వెళ్తుంటే వెనక్కి పరిగెత్తుతారు. ఆ తర్వాత ఇద్దరు రైల్వే స్టేషన్ వరకు వెళ్లి దిగినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Julián Cruz (@julianpks)

కదిలే బస్సులు, ట్రక్కుల మీద స్టంట్లు

ఇక రైలు మీదే కాదు, కదులుతున్న బస్సులు, ట్రక్కుల మీద పరిగెడుతూ రకరకాల సంట్లు చేస్తున్నారు ఈ ఇద్దరు యువకులు. ప్లై ఓవర్ మీద ఉండి, కింది నుంచి వెళ్లే బస్సులు, ట్రక్కులు మీద దూకుతూ వీడియోలు షూట్ చేస్తున్నారు. ఏ మాత్రం అటు ఇటు అయినా ప్రాణాలు పోవడం ఖాయం. అయినప్పటికీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫాలోవర్స్ కూడా బాగానే పెరుగుతున్నారు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు ప్రాణాలకు ముప్పు తప్పదంటున్నారు నెటిజన్లు. పాపులర్ అయ్యేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోకూడదంటున్నారు.

Read Also: దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు ప్రయాణం ఇదే.. వేగంలో వందే భారత్ కు ఏమాత్రం తీసిపోదు!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×