GRSEL Recruitment: బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది శుభవార్త. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్(GRSEL)లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 17 వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కోల్ కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్(GRSEL)లో ఖాళీగా ఉన్న టెక్నికల్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2
ఇందులో ప్రాజెక్ట్ సూపరెండెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి బీఈ/బీటెక్(మెకానికలక్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్, నావెల్ ఆర్కిటెక్చర్) పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. బీటెక్ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నవారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2024 డిసెంబర్ 1 నాటికి 54 ఏళ్లు మించి ఉండకూడదు
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.1,20,00 నుంచి రూ.2,80,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.590 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 17
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
అఫీషియల్ వెబ్ సైట్: https://grse.in/career/
Also Read: Gold In India: భారతీయ మహిళల వద్ద ఇంత బంగారమా.. ఎంతో తెలిస్తే షాకే..?
అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.