Kalki 2 Update: వైజయంతి మూవీస్ అధినేత నిర్మాత అశ్వినీ దత్(Ashwini Dutt) భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం ‘కల్కి 2898AD’. భారీ అంచనాల మధ్య గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్ల మార్కు కూడా దాటేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్(Prabhas ) ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీని తర్వాత సలార్ 2, కల్కి 2 చిత్రాలు సిద్ధంగా ఉంటాయి. ఒకవైపు సలార్ సినిమా షూటింగ్ సెట్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. మరొకవైపు కల్కి 2 గురించి కూడా కొన్ని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కల్కి 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో, అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ కీలకమైన అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్వినీ దత్.
కల్కి 2 విడుదలపై నిర్మాత కీలక అప్డేట్..
కల్కి మొదటి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతోంది? అనేది ఊహాజనితంగా చూపించారు. ఇక చివర్లో మహాభారతం ఎపిసోడ్.. అందులో కర్ణుడు, అనే అర్జునుడు సీన్స్ హైలెట్గా నిలిచాయి. వీటిని చూస్తే చాలామంది ఈ సన్నివేశాలు ఇంకొంతసేపు ఉండి ఉంటే బాగుండు అని కూడా ఆశపడ్డారు. అయితే ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరబోతోంది అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మీడియాతో మాట్లాడిన ఆయన..” కల్కి 2 వచ్చే ఏడాది విడుదలవుతుంది” అంటూ తెలిపారు. ఇకపోతే ఈ వార్త అభిమానులను కాస్త నిరాశపరిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాది కల్కి 2 విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడేమో వచ్చే ఏడాది అంటుంటే మరో ఏడాది వెయిట్ చేయాలా అంటూ నిరాశ వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక అశ్వినీ దత్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. రెండవ పార్ట్ కోసం ఎంతో శ్రమిస్తున్నాము. ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న క్రమంలో సినిమా విడుదలకు కూడా కాస్త ఆలస్యం అవుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము. ఈ సినిమాలో కమలహాసన్ (Kamal hassan)ఉంటారు . ప్రభాస్ (Prabhas) కమలహాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్గా నిలవనున్నాయి.ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పాత్రకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చాము. ఎక్కువగా రెండవ పార్ట్ లో వీళ్ళు ముగ్గురే కనిపిస్తారు. ఇక వీరితో పాటు దీపికా పదుకొనే (Deepika Padukone) పాత్రకి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటూ తెలిపారు అశ్వినీ దత్.
డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించిన నిర్మాత..
అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)గురించి మాట్లాడుతూ.. మహానటి సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కల్కి కూడా రూపొందించాడు. రెండు సూపర్ హిట్ అయ్యాయి. నాగ్ అశ్విన్ (Nag Ashwin) జీవితంలో ఓటమి అనేదే ఉండదని నేను నమ్ముతున్నాను. అతని ఆలోచన విధానం సినిమాలను తెరకెక్కించే తీరు అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి అంటూ అల్లుడు కం డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించార