Robot Attacks Humans| మానవులు తయారు చేసే కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ)తో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చాలా సార్లు హెచ్చరించారు. ఈ విషయం పలుమార్లు చాట్ జిపిటి, గూగుల్ జెమిని, గ్రోక్ ఎఐ వంటి చాట్ బాట్స్ విషయంలో రుజువైంది కూడా. అయితే ఈ చాట్ బాట్స్ కేవలం మానవులను హానికలిగించే విధంగా వ్యాఖ్యలు మాత్రమే చేశాయి. కానీ తాజాగా ఒక ఏఐ ప్రోగ్రామ్ తో తయారైన రోబో మాత్రం ఏకంగా దాడి చేసింది. అది కూడా మనుషులపై. ఈ ఘటన సిసిటీవి వీడియోలో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చింది.ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ కావడంతో చూసిన నెటిజెన్లందరూ భయాందోళనకు గురవుతున్నారు.
చైనాలోని ఒక టెక్ ఫ్యాక్టరీ గోడౌన్ లో సిసిటీవిలో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. సిసిటీవి వీడియో లో మనిషి ఆకారంలో ఉండే ఒక రోబో సమీపంగా ఉండే మనుషులపై తన యాంత్రిక చేతులతో ఆవేశంగా దాడి చేస్తున్నట్లు కనిపించింది. తెలిసిన వివారాల ప్రకారం.. అది ఒక యునిట్రీ హెచ్1 హ్యూమనాయిడ్ రోబో. దాన్ని ఒక క్రేన్ కు వేలాడదీసి ఉండగా.. అది ఒక్కసారిగా వెర్రెక్కినట్లు ప్రవర్తించింది. దాన్ని హ్యాండిల్ చేస్ యువకులపై దాడి చేసింంది. అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ పై పరిశోధనతో ప్రమాదం పొంచిఉందనే భయాలను ఈ వీడియో కలిగిస్తోంది. వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ ప్రకారం.. ఇద్దరు ప్రొగామర్లు ఆ రోబో ఎలా కదులుతుందో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అయితే అది ఒక్కసారిగా కంట్రోల్ తప్పి చాలా వేగంగా దాని కాళ్లు, చేతులు కదలిస్తూ.. ఏదో స్కై ఫై హారర్ సినిమా సీన్ ను తలిపించింది.
అయితే ఆ రోబో దాడి చేయబోతోందని గమనించి ఆ ఇద్దరు యువ పరిశోధకులు వెంటనే తప్పించుకొని పక్కకు జరిగారు. ఆ రోబోని వారు ఒక క్రేన్‌ను వేలాడదీసి ఉన్నారు. అయినా ఆ రోబో తన బలం మొత్తం ఉపయోగించి తన కాళ్లు చేతులతో వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. పరిశోధకులు తప్పించుకున్నా.. ఆ రోబో పక్కనే ఉన్న కంప్యూటర్, ఒక స్టాండుని కిందపడేసింది. అవి కిందపడి పగిలిపోయాయి. ఆ తరువాత ఒక యువకుడు దాన్ని నిలకడగా ఉంచడానికి వెంటనే దాని స్టాండ్ ని పట్టుకొని వెనక్కు లాగాడు.
Also Read: మధుమేహం ఉన్నవారు ఈ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో లాభం.. ఏవి తినాలంటే?..
ఈ సిసిటీవి విజువల్స్ హాలీవుడ్ సినిమా టెర్మినేటర్ ప్రాంచైజ్ ని గుర్తుకు చేస్తున్నాయి. ఆ సినిమాలో రోబో మెషీన్లు మానవ జాతిని అణచివేసి.. ఈ ప్రపంచాన్ని తమ అదుపులోకి తీసుకునేందుకు ప్రవర్తిస్తాయి. వీడియోలో కనిపించే యునిట్రీ రోబో ఇలా చేయడం మొదటిసారి కాదు. ఇంతకుముందు ఫిబ్రవరి 2025లో ఒక యునిట్రీ రోజో జనంపై విరుచుకుపడింది. వారంతా ఆ సమయంలో స్ప్రింగ్ ఫెస్టివల్ వేడుకలో ఉన్నారు. ఈ ఘటన ఈశాన్య చైనాలోని టియాన్ జిన్ ప్రాంతం లో జిరిగే స్ప్రింగ్ ఫెస్టివల్ గాలో లో జరిగింది.
అంతకుముందు అమెరికాలో కూడా టెక్సాస్ లో ఒక ఇంజినీర్ పై రోబో దాడి చేసింది. ఈ రోబోలు ఇలా హింసాత్మకంగా ప్రవర్తించడం వెనుక వాటి ప్రొగామింగ్, ఫంక్షనింగ్ లో తప్పులు జరగడమే కారణమని నిపుణులు సూచిస్తున్నారు.
An AI robot attacks its programmers as soon as it is activated in China. pic.twitter.com/d4KUcJQvtD
— Aprajita Nefes 🦋 Ancient Believer (@aprajitanefes) May 2, 2025