E-Paper
Advertisement

Diabetes Foods: మధుమేహం ఉన్నవారు ఈ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో లాభం.. ఏవి తినాలంటే?..

Diabetes Foods: మధుమేహం ఉన్నవారు ఈ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో లాభం.. ఏవి తినాలంటే?..

Diabetes Foods|డయాబెటీస్ అంటే మధుమేహం. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడం లేదా అసలు జరగకపోతే అది మధేమహానికి దారి తీస్తుంది. ఇన్సులిన్ మానవ శరీరంలో చక్కెర్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోతే డాక్టర్లు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ద్వారా అందిస్తారు. లేదా తీవ్రతను బట్టి టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మధుమేహం ఉన్న వారు కొన్ని రకాల ఆహారం మాత్రమే తీసుకోవడం మంచింది. ముఖ్యంగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.

మనం తినే ఆహారం జీర్ణం అయిన తరువాత ఎంత త్వరగా షుగర్ లాగా మారుతుందో ఆ వేగాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ ద్వారా కొలవడం జరగుతుంది. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు రక్తంలో షుగర్ బ్యాలెన్స్ చేసి తక్షణ ఎనర్జీని శరీరానికి అందిస్తాయి. అందుకే మధుమేహం ఉన్నవారు ఇలాంటి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ప్రతిరోజు తింటే వారి షుగర్ లెవెల్స్ త్వరగా తగ్గిపోతుందని డయాబెటీస్ నిపుణులు సూచిస్తున్నారు.

లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇవే..
ఓట్స్: వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ 55 పాయింట్ల వరకు ఉంటుంది. రక్తంలో ఫైబర్ స్థాయి పెరిగితే బ్లడ్ షుగర్ తగ్గుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. అందుకే ఓట్స్ లాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ప్రతిరోజు తింటే అది శరీరంలో బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది.

జొన్న, బార్లే: మధుమేహంతో బాధపడేవారు మిల్లెట్ (జొన్నలు), బార్లే లాంటి ఫుడ్స్ తప్పకతీసుకోవాలి. వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ 45 నుంచి 52 మధ్యలో ఉంటుంది. జొన్నలో ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది. వీటితో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. అందుకే మధుమేహం ఉన్నవారు గోధుమకు బదులు జొన్నతో తయారు చేసిన రొట్టెలు లేదా ఇతర ఆహారం తీసుకోవాలి. ఇవి తినడం వల్ల బ్లడ్ షుగర్ వేగంగా నియంత్రణలోకి వస్తుంది.

యాపిల్, పియర్స్, జామపండ్లు: ఈ మూడు రకాలు పండ్లలో కూడా నాచురల్ షుగర్స్ ఉంటాయి. అయితే ఇందులో అధిక ఫైబర్ కంటెంట్ ఉండడంతో ఈ ఫ్రూట్స్ కు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కింది. వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ స్థాయి 30 నుంచి 40 మధ్యలో ఉంటుంది. తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ ఫ్రూట్స్ తినేవారికి టైప్ 2 డయాబెటీస్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది.

Also Read: పడకగదిలో ఆ సమస్య.. ఈ పండు తింటే వయాగ్రా లాంటి శక్తి

పచ్చని కూరగాయలు: స్పైనాచ్, ఫెనుగ్రీక్, టమోటా, బెండకాయ లాంటి తక్కువ కెలోరీలు, కార్బ్స్ ఉన్న కూరగాయలు శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిని నియత్రించడానికి ఉపకరిస్తాయి. ఈ కూరగాయలన్నింటిలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గ్లూకోజ్ ని తక్కవ స్థాయిలో ఉంచడం ద్వారా బ్లడ్ షుగర్ ని నియత్రిస్తాయి.

ఈ జాబితా మొత్తం పరిశీలిస్తూ మధుమేహ బాధితులు ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ట్, రిఫైన్డ్ ఫుడ్స్ తినకూడదు. ప్రొటీన్ తో పాటు, హెల్తీ ఫ్యాట్స్ ఉన్నవి మాత్రమే తినాలి. అప్పుడే గ్లైసిమిక్ ఇండెక్స్ మరింత తగ్గుతుంది. మధుమేహం ఉన్నవారు ఒక రోజులో 4 నుంచి 5 సార్లు తక్కువ మోతాదులో భోజనం చేయాలి.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×