BigTV English

Capsicum: క్యాప్సికం తింటే కడుపులో అల్సర్స్ వస్తాయా? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..

Capsicum: క్యాప్సికం తింటే కడుపులో అల్సర్స్ వస్తాయా? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..

Capsicum: క్యాప్సికం, సాధారణంగా దీన్ని బెల్ పెప్పర్స్ లేదా మిరపకాయలు అని పిలుస్తారు. దీన్ని తినడం వల్ల ఏదో జరిగిపోతుందనే అపోహలు చాలా ఉంటాయి. అందులో ఒక సాధారణ అపోహ ఏమిటంటే, అన్ని క్యాప్సికంలు కారంగా ఉంటాయని. నిజానికి, క్యాప్సికంలలలో తీపి బెల్ పెప్పర్స్ (ఇవి కారం లేనివి) నుండి హబనీరో వంటి కారంగా ఉండే రకాల వరకు ఉంటాయి. కారం అనేది క్యాప్సైసిన్ అనే సమ్మేళనం వల్ల వస్తుందట. ఇది తీపి బెల్ పెప్పర్స్ లో ఉండదు.


మరో అపోహ ఏమిటంటే, క్యాప్సికం తినడంవల్ల కడుపులో అల్సర్స్ చాలా మంది నమ్ముతారు. కానీ క్యాప్సికం ఎలాంటి అల్సర్స్‌ని కలిగించదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి, ఇది కడుపు లైనింగ్‌ను రక్షించడానికి ఉపయోగపడే శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుందట. అయితే దీనిని ఎక్కువగా తినడం సున్నితమైన కడుపును చికాకు పెట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

వాటి రంగుల ఆకర్షణ, దక్షిణ అమెరికా, ఆసియా సంప్రదాయాల్లో ఆచారాల్లో ఉపయోగించడం వల్ల కొన్ని సంస్కృతుల్లో ఇవి చెడు ఆత్మలను తరిమికొడతాయని నమ్ముతారు. ఇందుకు ఎటువంటి ఆధారాలు లేవు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు బెల్ పెప్పర్స్ వేరువేరు జాతులు అని.


క్యాప్సికం వల్ల లాభమేంటి?
క్యాప్సికం మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికంలలో విటమిన్-సి సమృధ్ధిగా ఉంటుంది రోజుకొక ఎరుపు బెల్ పెప్పర్ తీసుకోవడం వల్ల విటమిన్-సి సాధారణం కంటే 150% ఎక్కువగా సరఫరా అవుతుందట. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మం , కీళ్లకు కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడి గుండె జబ్బులు, కాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా కాపాడతాయని డాక్టర్లు చెబుతున్నారు.

కారంగా ఉండే క్యాప్సికంలోని క్యాప్సైసిన్ బరువు నియంత్రణకు సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఆకలిని తగ్గిస్తుందట. క్యాప్సైసిన్ కొవ్వును కరిగించి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడమే కాక రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాప్సికంలు తక్కువ కేలొరీలు కలిగి ఉండడంవల్ల బరువు తగ్గించడానికి ఇవి ఒక గొప్ప ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.

క్యాప్సికంలలోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతూ క్రమం తప్పకుండా కడుపు కదలికలను ప్రోత్సహించడమే కాకుండా ప్రయోజనకరమైన గట్ బాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాల వల్ల వాపును నోరోధించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందట. వీటిలో ఫోలేట్ ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకూ శిశువులో నీరసగొట్టం లోపాలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: ఉదయాన్నే ఈ నీరు తాగితే రోజంతా హుషారే..

క్యాప్సికమును క్రమం తప్పకుండ తినడంవల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటిలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. సలాడ్లలో పచ్చివి, కాల్చినవి లేదా వేయించినవిగా వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

క్యాప్సికంలు పోషకాలతో నిండి రోగనిరోధక శక్తి నుండి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటి కారం లేదా ఆరోగ్య ప్రమాదాల గురించిన అపోహలను తొలగించి రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ రుచినీ, పోషక విలువలను అందరు ఆస్వాదించవచ్చని వైద్యుల సలహా.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×