E-Paper
Advertisement

Viral Video: పోలీసులు స్పందించలేదని ‘టవర్’ ఎక్కాడు.. కొత్తచెరువులో హైడ్రామా!

Viral Video: పోలీసులు స్పందించలేదని ‘టవర్’ ఎక్కాడు.. కొత్తచెరువులో హైడ్రామా!
Advertisement

Viral Video:  శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో సోమవారం నాడు ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కదిరేపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు ఈ సాహసోపేతమైన చర్యకు పూనుకున్నాడు. చేతిలో తెలుగుదేశం పార్టీ (TDP) జెండా పట్టుకుని సెల్ టవర్ పైకి ఎక్కి తన గోడును వెళ్లబోసుకున్నాడు.

లక్ష్మీనారాయణ కుమార్తెకు ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. అయితే.. వివాహ సమయంలో కట్నం కింద ఇచ్చిన బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ అల్లుడు నిరాకరిస్తున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు సరైన రీతిలో స్పందించలేదని, తనకు న్యాయం జరగడం లేదన్న మనస్తాపంతోనే తాను టవర్ ఎక్కినట్లు లక్ష్మీనారాయణ తెలిపాడు.

Advertisement

టవర్ పై వ్యక్తిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లక్ష్మీనారాయణను కిందికి దింపేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు దిగేది లేదని ఆయన భీష్మించుకు కూర్చోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు, స్థానిక నాయకులు నచ్చజెప్పడంతో ఆయన కిందకు దిగివచ్చారు. బాధితుడి సమస్యను పరిశీలించి, చట్టపరంగా న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ALSO READ: 125 కేసుల నేరగాడికి చెక్.. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి కేంద్ర గ్యాలంటరీ మెడల్!

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×