School Principal Librarian Fight| విద్యా సంస్థలంటే క్రమశిక్షణకు నిలయం. పిల్లలకు చదువుతోపాటు జీవనవిధానం నేర్పించే ఆలయం. అక్కడ గురువులు, సిబ్బంది అంతా పిల్లలకు విద్యత పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ బోధిస్తారు. అలాంటి చోట పనిచేసే సిబ్బంది ఒకరినొకరు దూషించుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చివరికి అక్కడ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసేవారు వచ్చి రక్షించాల్సి వచ్చింది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా?.. కానీ ఈ ఘటన నిజంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక మహిళా ప్రిన్సిపాల్ తన స్కూల్ లో పనిచేసే లైబ్రేరియన్ తో ప్రవర్తించిన తీరు ఈ వీడియోలో దారుణంగా ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మద్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖర్‌గోన్ నగరంలో ఏక్ లవ్య ఆదర్శ స్కూల్ ఉంది. ఆ స్కూల్ లో పనిచేసే మహిళా ప్రిన్సిపాల్ ఏదో విషయమై అక్కడ లైబ్రేరియన్ ఉద్యోగంలో మరో మహిళతో ఘర్షణ పడ్డారు. ప్రిన్సిపాల్ ముందుగా ఆమెను అసభ్యంగా మాట్లాడడంతో లైబ్రేరియన్ తన ఫోన్ లో ప్రిన్సిపాల్ మాటలను వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించింది. అయితే ప్రిన్స్ పాల్ అది గమనించి.. వెంటనే లైబ్రేరియన్ చేతిలో నుంచి ఫోన్ లాగేసుకుంది. అంతటితో ఆగక లైబ్రేరియన్ ను ఒక చెంప దెబ్బ కొట్టి.. ఆ తరువాత ఆమె ఫోన్ ని కింద పడేసి తొక్కేసింది.
Also Read: పెళ్లిలో వధూవరుల బంధువుల మధ్య గొడవ.. తందూరి రోటీ కోసం ఇద్దరు హత్య
ఇదంతా చూసిన లైబ్రేరియన్ పట్టరాని కోపంతో.. “మీకెంత ధైర్యం మేడం.. నా దెగ్గర నుంచి ఫోన్ లాగేసుకుంటారా? నాపై చేయి చేసుకుంటారా?” అంటూ అరవడం ప్రారంభించింది. ఇంతలో ఆ ప్రిన్సిపాల్ తన ఫోన్ తీసి ఆమెను రికార్డ్ చేయడం ప్రారంభించింది. తరువాత ఆ లైబ్రేరియన్.. ప్రిన్సిపాల్ (పంజాబీ డ్రెస్సు వేసుకొని ఉంది) భుజంపై ఉన్న చున్నీని లాగేసి కిందపడేసింది. ప్రిన్సిపాల్ పై చేయి చేసుకుంది. దీంతో ఆమె వీడియో రికార్డ్ చేయడం ఆపేసి లైబ్రేరియన్ పై దాడి చేయడం ప్రారంభించింది. ఇక ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. ముందుగా ప్రిన్స్ పాల్.. లైబ్రేరియన్ జుట్టును పట్టుకొని లాగేసింది. ఆ తరువాత కాసేపటికి లైబ్రేరియన్ కూడా ప్రిన్స్ పాల్ జుట్టు పట్టేసుకుంది.
ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఎదురుగా ఉన్నవారిలో ప్రిన్స్‌పాల్ కొడుకు, స్కూల్ లో పనిచేసే ఆయా ఉన్నారు. ముందుగా ప్రిన్స్ పాల్ కొడుకు.. ఇక చాలు అమ్మ.. ఆపేయ్.. పోనీ వదిలేయ్ అని అంటున్నాడు. ఇంతో ఆయా వచ్చి ఇద్దరినీ ఇద్దరూ వెనక్కు వెళ్లండి. ఇలా కొట్టుకుంటున్నారేంటి? అని విడదీసింది.
ఇదంతా అక్కడ ఉన్న వారిలో ఒకరు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. వీడియో బాగా వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ ముందుగా ప్రిన్స్ పాల్‌ను సస్పెండ్ చేశారు. స్కూల్ లో లైబ్రేరియన్ గా ఉద్యోగం చేసే మధురాణిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖకు సూచించారు.
వీడియో వైరల్ కావడంతో నెటిజెన్లు భలే కామెంట్లు చేస్తున్నారు. “ఇది స్కూల్ ఫైట్ కాదు క్యాట్ ఫైట్” అని ఒకరు అంటే.. మరొకరేమో అంత చదువుకున్నవారు కొట్టుకుంటున్నారు. చదువులేని ఆయా వచ్చి వారిని కాపాడింది. వారికంటే ఆమె ఎంతో బెటర్” అని రాశాడు.
The school principal and librarian indulged into a physical fight at the premises of a government Eklavya School in Madhya Pradesh’s Khargone.
In the video, it can be seen, both the officials slapped each other, pulled hair, and pushed each other. The principal also broke the… pic.twitter.com/nk2z63oWIL
— ForMenIndia (@ForMenIndia_) May 4, 2025