Indian Army Video: ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ దాడిలో 80 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. 1971 తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాటి వెళ్లి భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. పక్కా ప్లాన్ తో దాడి చేసినట్టు తెలుస్తోంది. రోజులు, గంటల తరబడి దాడి జరగలేదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే పాక్ భూభాగంలోకి వెళ్లి టార్గెట్ ఫినిష్ చేసుకొని వచ్చాయి భారత్ బలగాలు. అర్థరాత్రి ఒంటి గంట 28 నిమిషాలకు ఇండియన్ ఆర్మీ ఓ వీడియో రిలీజ్ చేసింది. యుద్ధానికి మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
ఈ పోస్టును దాయాది దేశం గానీ.. ఉగ్రవాదులు కూడా చూడక ముందే యుద్ధం ఎలా ఉంటుందో చూపించాయి మన బలగాలు. ఒంటి గంట 44 నిమిషాలకు దాడి చేసినట్టు మళ్లీ ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అంటే 16 నిమిషాల్లోనే ఉగ్ర శిబిరాలు నేలమట్టం అయ్యాయి. ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9 ఉగ్రశిబిరాలను నేల మట్టం చేసిన వచ్చేశాయి. పాక్ సైన్యాన్ని టచ్ చేయకుండా, అక్కడి ప్రజలకు ఏం కాకూడదని లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేస్తూ 16 నిమిషాల్లో పని పూర్తి చేసుకొని వచ్చారు మనోళ్లు.
పాకిస్థాన్‌లోని తొమ్మిది ప్రదేశాల్లో భారత్ దాడి చేసే ముందు ఒక రహస్య సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. గెలవాడానికి శిక్షణ పొందామంటూ చేసిన వీడియో ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యుద్ధ ట్యాంకులు, వైమానిక దాడులకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు మెరుపుదాడులు చేశాయి.
ఇదిలా ఉంటే.. ఇండియా దాడిలో.. హిజ్బుల్ ముజాహద్దీన్‌కు గట్టి దెబ్బ తగిలింది. రెండు ఉగ్ర క్యాంపులు ధ్వంసమయ్యాయి. సెయిల్‌కోట్‌లోని మెహమూనా, కోట్లిలోని మస్కర్ రహీల్ షాహిద్ క్యాంపులను నేలమట్టం చేసింది భారత్. ఐతే ఎంత మంది చనిపోయారన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
ఐతే హిజ్బుల్ ముజాయిద్దీన్ పుట్టింది జమ్మూకశ్మీర్‌లో. హిజ్బుల్ ముజాహద్దీన్..! అంటే తెలుగులో పవిత్ర యోధులు. పేరుకు పవిత్రం. కానీ చేసేదంతా నరమేథమే. పాక్ ISI సహకారంతో 1989లో ఎహ్సాన్ దార్ దీన్ని స్థాపించాడు. ఆజాదీ కశ్మీర్ దీని లక్ష్యం. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను రిక్రూట్ చేస్తూ, దాడులకు పాల్పడుతూ వస్తోంది. 2009లో సోపోర్‌లో CRPF జవాన్లపై కాల్పులు జరిపిందీ ఈ సంస్థే. పీవోకే కేంద్రంగా పనిచేస్తోంది. దీని హెడ్ క్వార్టర్స్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫ్ఫరాబాద్‌లో ఉంది. ప్రస్తుతం సయీద్ సలాహుద్దీన్ని అధ్యక్షుడిగా ఉన్నాడు.
Also Read: 244 చోట్ల డ్రిల్స్.. పీవోకేలో మన జెండా ఎగురవేయడమే లక్ష్యం..!
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన వైమానికి దాడులపై స్పందించింది ఇండియన్ ఆర్మీ. కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్‌కు గట్టిగా బదులిచ్చినట్లు తెలిపింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు తెలిపింది సైన్యం. కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ట్వీట్ చేసింది. పాక్ మిలటరీపై ఎక్కడా దాడులు చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసింది ఆర్మీ ఈ క్షిపణి దాడులు తర్వాత న్యాయం గెలిచిందంటూ మరో ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ.
जय हिंद की सेना! 🇮🇳 pic.twitter.com/asa0Ijasic
— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 7, 2025
Operation Sindoor🙌🏻#IndoPakBorder
pic.twitter.com/TKQeevy5RF— G3 (@gayatri008_16) May 6, 2025
"प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"
Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI – INDIAN ARMY (@adgpi) May 6, 2025