Gauri Khan: బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ లో కూడా వరుస బ్లాక్ బాస్టర్లు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయారు. ఇకపోతే షారుఖ్ ఖాన్ పెళ్లయిన తర్వాత గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తో ప్రేమలో పడి, ఆమెతో రిలేషన్ కొనసాగించారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక దీనిపై ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా సీరియస్ రియాక్షన్ ఇచ్చిందని సమాచారం. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
భార్య ఉండగానే ప్రియాంక మోజులో పడ్డ షారుక్..
అసలు విషయంలోకి వెళ్తే.. షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా కలిసి నటించకముందు నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులు. బాలీవుడ్లో జరిగే పార్టీల తోనే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆమె నవ్వు, లౌక్యం లేని ప్రవర్తనే షారుక్ ను మరింత ఆకట్టుకుంది. ఆమెను ఇష్టపడేలా చేసింది. ఆమెతో గడపడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వదులుకునేవాడు కాదు. తను హాజరయ్యే ఫంక్షన్లు, ఈవెంట్లకు కచ్చితంగా ప్రియాంకను పిలవమని హోస్ట్ లను, నిర్వాహకులను కోరేవాడు షారుక్. ఇక సూపర్ స్టార్ మాటను కాదనలేక వారు ప్రియాంకతో పరిచయం లేకపోయినా సరే ఆమెను ఎన్నోసార్లు పార్టీలకు పిలిచిన సందర్భాలు ఉన్నాయట. అలాగే ఒకసారి కరణ్ జోహార్ (Karan Johar) బర్తడే కి కూడా ప్రియాంకను ఆహ్వానించమని కరణ్ ను బలవంత పెట్టారట షారుక్ ఖాన్. ఇక స్నేహితుడిని నిరాశపరచడం ఇష్టం లేక ప్రియాంకను పార్టీకి పిలిచాడు. ఇక పార్టీకి వచ్చిన ప్రియాంకను చూసి సంతోష పడిపోయిన షారుక్ అందరి ముందే ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మరి ఆమెను రిసీవ్ చేసుకోవడంతో కరణ్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అటు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ (Gauri Khan) కి కూడా ఈ విషయం మింగుడు పడలేదు.
దెబ్బకు ఇండస్ట్రీని వదిలిన ప్రియాంక చోప్రా..
అయితే ఈ విషయం ఇక్కడితో ఆగలేదు. అమితాబ్ బచ్చన్ డాన్ రీమేక్ సినిమా వల్ల ప్రియాంక చోప్రాతో నటించే అవకాశం వచ్చిందని పొంగిపోయాడు. ఆ సినిమా సెట్ లోనే వాళ్ళ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అవుట్డోర్లో తెల్లవారుజాము మూడింటి వరకు కబుర్లు చెప్పుకుంటూ యూనిట్ ను ఆశ్చర్యపరిచారు. ఇక ప్రశ్నార్ధకంగా వారి బంధాన్ని చూసిన వాళ్లకు రిహార్సల్స్ అని వదిలిచ్చారు. డాన్ సిరీస్ వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి సూపర్ హిట్ అయింది. ప్రియాంక మీద షారుక్ ప్రేమ బలమయ్యింది. తనకే ఆఫర్లు వచ్చినా.. అందులో ప్రియాంకను హీరోయిన్గా తీసుకోమని దర్శక, నిర్మాతలను అడిగేవాడట. కమర్షియల్ యాడ్స్ లో కూడా తన పక్కన ప్రియాంకను సైన్ చేయమని డిమాండ్ చేసేవాడట. అంతేకాదు ఐపీఎల్ టీమ్ మ్యాచ్ లకి కూడా ప్రియాంకను వెంట తీసుకువెళ్లేవాడు . ఇక షారుక్ కనిపించిన ప్రతి పబ్లిక్ ప్లేస్ లో కూడా ప్రియాంక కనిపించేది. దాంతో అభద్రతకు లోనైన గౌరీ ఖాన్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది. ప్రియాంక చోప్రా తో తిరగడమే కాకుండా ఆమెతో కలిసి సినిమాలు చేయకూడదని, వినకపోతే విడాకులే అని అతడికి వార్నింగ్ ఇచ్చింది. దాంతో కుమిలిపోయాడు. ఆమెకు దూరం కాలేక డిప్రెషన్ కి వెళ్ళాడు. ఇక చివరికి భార్య ముఖ్యమని ప్రియాంకను వదిలేశాడు. ముఖ్యంగా గౌరీ ఖాన్ తన స్నేహితులైన కరణ్ జోహార్, సుస్సానే ఖాన్ వంటి వాళ్ళ సహాయంతో ప్రియాంకను తమ సినిమాల్లోకి తీసుకోవద్దని కరణ్ జోహార్ ద్వారా నిర్మాతలకు, తమ భర్తల పక్కన హీరోయిన్గా అవకాశాలు ఇవ్వద్దని సుస్సానే ద్వారా ఇతర హీరోల భార్యలకు కూడా చెప్పించింది. అలా అందరూ కలిసి ప్రియాంకను ఒంటరి చేశారు. ఇక బాలీవుడ్ లో ఇంత మంది తనకు అవకాశాలు ఇవ్వకపోయేసరికి ఆ బాధను తట్టుకోలేక హాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడ రెట్టింపు స్టార్ స్టేటస్ తో మళ్ళీ తిరిగి వచ్చింది ప్రియాంక.
ALSO READ:Shahrukh Khan: మెట్ గాలాలో షారుఖ్.. ఆయన ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!