BigTV English

Ragging in College Hostel: ర్యాగింగ్‌ పేరుతో జూనియర్లను.. కర్రలతో చావబాదిన సీనియర్లు..

Ragging in College Hostel: ర్యాగింగ్‌ పేరుతో జూనియర్లను.. కర్రలతో చావబాదిన సీనియర్లు..

Student Held Over Ragging at SSN College Narasaraopet: ర్యాగింగ్‌ వద్దని ఏళ్లుగా నోళ్లు బాదుకుంటున్నా.. కొందరు విద్యార్థులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. చదువుకుంటారని కాలేజీకి పంపిస్తే.. చదువు తప్ప అన్నీ చేస్తుంటారు. సీనియారిటీ వస్తే చాలు ఇక తెగ రెచ్చిపోతారు. తమంతట వాళ్లే లేరని విర్రవీగిపోతారు. వారి శాడిజమంతా జూనియర్లపై చూపిస్తూ సైకో ఆనందం పొందుతారు.


గుంటూరు జిల్లాలోని ఓ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల వికృత చేష్టలు.. వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. నరసరావుపేటలోని SSN కాలేజీలో NCC ట్రైనింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను ర్యాగింగ్‌ పేరుతో చావబాదారు. అర్థరాత్రి ఒక్కొక్కరిగా జూనియర్లను తమ గదికి పిలుపించుకుని.. మూకుమ్మడిగా కర్రలతో చితక్కొట్టేశారు. అది కూడా వారిని పడుకోబెట్టి పిరుదులపై కొట్టి.. సైకోల్లా బిహేవ్‌ చేశారు. ఏడుస్తున్నా కనికరించలేదు.

ఏడిస్తే మళ్లీ కొడతామంటూ బెదిరించారు. అంతేకాకుండా వారిని కొడుతూ వీడియోలు తీస్తూ ఏంజాయ్‌ చేశారు.అయితే జూనియర్ విద్యార్ధులు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ర్యాగింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నరసరావుపేట పోలీసులు కాలేజీ వద్దకు చేరుకొని స్టూడెంట్స్ తోమాట్లాడి వివిరాలు సేకరిస్తున్నారు.


Also Read: మరోసారి ఢిల్లీ మెట్రోలో రచ్చ.. యువతి మామూలుగా రెచ్చిపోలేదు

అయితే దీనిపై కాలేజి సిబ్బందిని వివరణ కోరగా.. వాస్తవానికి ఈ ఘటన జరిగి ఏడాది దాటిందని చెబుతున్నారు. అయితే తాజాగా విద్యార్దులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ర్యాగింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా.. అందుకు తగిన చర్యలు చూసుకుంటామని.. పోలీసులు తెలియజేశారు.

 

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×