BigTV English

Tollywood:బాబాయ్ పవన్ ను అంతమాట అనేసిందేమిటి నిహారిక?

Tollywood:బాబాయ్ పవన్ ను అంతమాట అనేసిందేమిటి నిహారిక?

Niharika Konidela comments on Pawan Kalyan(Today tollywood news):

కొణిదెల నిహారిక మెగా డాటర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. పెద్దగా సినిమాలు చేయకపోయినా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసి మంచి సక్సెస్ లు అందుకుంటోంది. నటనలో ఉన్న అభిరుచితో అడపాదడపా షార్ట్ ఫిలింస్ చేస్తోంది. హీరోయిన్ గా చేసిన అతి కొద్ది చిత్రాలు నటపా పరంగా నిహారికకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. సందర్భం వచ్చినప్పుడల్లా తన పెద్దనాన్న చిరంజీవిని, బాబాయ్ పవన్ కళ్యాణ్ ను పొగుడుతుంటారు. వాళ్ల సూచనలు, సలహాలు తీసుకునే తాను ఇండస్ట్రీలో ఇంత స్థాయికి ఎదిగానని సగర్వంగా చెబుతుంటారు. నటిగా, యాంకర్ గా, రియాలిటీ షో ఘోస్ట్ గా,. నిర్మాతగా విభిన్న రంగాలలో రాణిస్తోంది నిహారిక. ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తూ యూనిట్ లో అందరితోనూ కలుపుగోలుగా ఉంటారామె.


కమిటీ కుర్రాళ్లు ప్రమోషన్స్

ఆమెతో షూటింగ్ లో పాల్గొన్న యూనిట్ చాలా హ్యాపీగా ఫీలవుతుంటారు. ఎంత వర్క్ ఉన్నా ఏనాడూ నెర్వస్ కు గురవ్వరని నిహారికను బాగా తెలిసిన వాళ్లు చెబుతుంటారు. అయితే ఇటీవల నిహారిక ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కమిటీ కుర్రాళ్లు అనే క్యాచీ టైటిల్ తో యూత్ ను ఆకట్టుకునేలా నిర్మించారు. అయితే ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ కమిటీ కుర్రాళ్లు మూవీకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. జబర్దస్థ్ సుడిగాలి సుధీర్ ఘోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆ రియాలిటీ షోలో తనతో ఎప్పుడు షో ఉండబోతోందని ఆసక్తిగా సుధీర్ ని అడిగారు. అందుకు సుడిగాలి సుధీర్ తన స్టయిల్ లో జోక్ గా మీకేంటి మేడమ్ మీరు మెగా డాటర్. మీ వెనక మెగా సైన్యమే ఉంది. అటు మెగాస్టార్ చిరంజీవి ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు.


శ్రీరాముడితో పోలిక

ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మినిస్టర్ అయ్యాక తన అన్న కుటుంబాన్ని సందర్శించారు. అక్కడే ఉన్న తల్లి, వదిన, అన్నలకు పవన్ పాదాభివందనం చేశారు. ఈ వీడియో ప్రముఖంగా క్షణాలలో వైరల్ అయింది అప్పట్లో. నెటిజన్స్ అంతా పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. పెద్దల పట్ల చిరంజీవికి ఉన్న భక్తి భావాన్ని చూసి అంతా దీనిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీడియో మొత్తం ప్లే చేశాక సుడిగాలి సుధీర్ నిహారికతో ‘ఈ వీడియో అంతా చూశాక మీకు ఎలా అనిపించింది?’ అన్నారు. అంతేకాదు పవన్ సక్సెస్ మీకు ఎలా అనిపించింది అని అడగగా..చిన్నప్పటినుంచి బాబాయ్ స్ఫూర్తితోనే పెరిగాను. ఆయన వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. ఏ పని చేసినా అంకితభావంతో చేస్తారు. పవన్ రాజకీయాలకు వచ్చి చాలా కాలమే అవుతున్నా సక్సెస్ రుచి ఇప్పుడే చూస్తున్నారు. నా వరకూ అరణ్య వాసం అనంతరం అయోధ్య పట్టాభిషేకం జరుపుకున్న ఆ శ్రీరాముడే గుర్తుకు వస్తున్నారని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు నిహారిక. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో నిహారిక చేసిన పాజిటివ్ కామెంట్లకు అదిరిపోయే లెవెల్ లో రెస్పాన్స్ వస్తోంది. నిహారిక కంపారిజఃన్ చాలా బాగుంది..సందర్భోచితంగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×