BigTV English
Advertisement

Viral Girl Monalisa: ఆహా.. ఏమా అందం.. కుంభమేళాలో ఈ న్యాచురల్ బ్యూటీ ఎవరంటే!

Viral Girl Monalisa: ఆహా.. ఏమా అందం.. కుంభమేళాలో ఈ న్యాచురల్ బ్యూటీ ఎవరంటే!

Viral Girl Monalisa: మహా కుంభమేళా అనగానే.. సాధువులు, అఘోరాలు, కోట్లాది మంది భక్తజనం గుర్తొస్తారు. కానీ.. ఆ కోట్ల మందిలోనే.. వేల మంది చిరు వ్యాపారులు ఉంటారు. వారిలో.. పూసలు అమ్ముకునే అమ్మాయిలూ ఉంటారు. వాళ్లలో ఓ అమ్మాయి ఓవర్‌‌నైట్‌లో సోషల్ మీడియా సెన్సేషన్‌‌గా మారిపోయింది. ఇన్‌స్టాలో.. ఇన్‌స్టంట్‌‌గా వైరల్ అయిన ఆ అమ్మాయి కథేంటి? ఎందుకు సోషల్ మీడియాలో ఆమె గురించి ఇంత డిస్కషన్ నడుస్తోంది?


మహా కుంభమేళా మొదలైనప్పటి నుంచి.. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక ఉత్సవానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివస్తున్న దృశ్యాలు, పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వీడియోలు.. సోషల్ ప్లాట్ ఫామ్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో.. సాధువులు, వివిధ బాబాలు, అఘోరాలు.. ఇలా చాలా మంది ఉంటున్నారు. వాళ్లకు సంబంధించిన విజువల్స్.. మహా కుంభ్ హ్యాష్ ట్యాగ్‌తో తెగ వైరల్ అవుతున్నాయి. అలా.. మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతున్న అమ్మాయి కూడా ఇప్పుడు వైరల్ సెన్సేషన్‌గా మారింది. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తోంది. నాలుగైదురోజులుగా.. ఆ అమ్మాయికి వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

కాటుక కళ్లు, డస్కీ స్కిన్, చక్కని చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్‌తో ఉన్న ఈ అమ్మాయి. తన సహజ సౌందర్యంతో అందరినీ అటెన్షన్‌ని తన మీదకు మళ్లేలా చేసింది. ఓ వ్లాగర్.. ఈ అమ్మాయినీ వీడియో తీసి ఇన్ స్టా రీల్స్‌లో పోస్ట్ చేశాడు. అంతే.. కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. ఇండోర్‌కు చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్. ఈమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. మహా కుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఈ అమ్మాయి అందం గురించే.. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అందానికి తగ్గట్లే అమ్మాయి పేరు మోనాలిసా. కుంభమేళాలో రుద్రాక్ష పూసల్ని అమ్ముతోంది. ఆమె సహజ అందం, గోధుమ రంగు కళ్లు.. ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడీ అమ్మాయిని సోషల్ మీడియాలో అంతా మోడల్‌తో పోలుస్తున్నారు.


Also Read: సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టిన కస్టమర్లు, వామ్మో.. తింటుండగా ఒక్కసారి షాక్!

మోనాలిసా.. వివిధ మతపరమైన ప్రదేశాల్లో రుద్రాక్షల్ని, ముత్యాల పూసల్ని విక్రయిస్తుంది. అదే.. ఆమెకు ఉన్న ఉపాధి. ఇప్పుడు కుంభమేళాకు వచ్చింది కూడా దానికోసమే! కానీ.. ఆమె లుక్స్, అందంతో.. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తాయని ఆమెకు కూడా తెలియదు. అయినా.. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో.. ఈ అమ్మయి ఇప్పుడో వైరల్ సెన్సేషన్. కుంభమేళాకు వచ్చిన చాలా మంది భక్తులు.. మోనాలిసా ఫోటోలు, వీడియోల్ని వైరల్ చేశారు. ఈ అమ్మాయిపై టన్నుల్లో ప్రేమని కురిపిస్తున్నారు. ముఖ్యంగా.. ఆమె కళ్లు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. మోనాలిసా ఫోటోలు, వీడియోలకు.. లైకుల్, కామెంట్లు వరదలా వస్తున్నాయి. ఆమెతో సెల్ఫీలు దిగుతూ.. వాటిని కూడా పోస్ట్ చేస్తున్నారు.

Related News

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

Big Stories

×