MS Dhoni: మహేంద్రసింగ్ ధోని.. ఇతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి దూరమై ఏళ్లు గడుస్తున్నా.. ఇతనికి క్రికెట్ లోకంలో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వారి కోసమే ధోని సైతం ఐపీఎల్ 2025 కోసం ఓ రేంజ్ లో రెడీ అవుతున్నాడు. తనని తాను ఫిట్ గా ఉంచుకొని, ఐపీఎల్ 2025 కోసం కష్టపడి శిక్షణ తీసుకుంటున్నాడు.
Also Read: Snehasish Ganguly: టీమిండియా ప్లేయర్లకు మరో షాక్.. ఇకపై ఆ బస్సులే ఎక్కాలి !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకరు. గత నాలుగు సంవత్సరాల నుండి ధోని ఆడబోయే చివరి ఐపీఎల్ సీజన్ ఇదే అంటూ ప్రతిసారి వార్తలు రావడం.. అతడు మాత్రం తన నోటి నుంచి నేరుగా ఎలాంటి సమాధానం చెప్పకుండా ఒక్కో సీజన్ ఆడుతూ వెళ్లడం జరుగుతూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదు టైటిల్స్ గెలిచిన రెండవ జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ రికార్డుని సమం చేసి రికార్డు సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్.
ధోని బ్యాట్ తో గ్రౌండ్ లో బరిలోకి దిగినప్పుడు అభిమానులు ధోనీ పేరుతో నినాదాలు చేయడం వల్ల భావోద్వేగానికి గురయ్యానని ధోని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. తన ఆటను చూసేందుకు వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటానని తెలిపాడు ధోని. అయితే అసలు ధోని ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఆడతాడా..? లేదా..? కేవలం మెంటార్ గా ఉంటారా..? అనే సందేహాలు చాలామందిలో ఉండేవి. కానీ ఈసారి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ధోని బరిలోకి దిగబోతున్నాడు.
ధోనీ కోసమే బీసీసీఐ కూడా ఈ కొత్త నిబంధనని తీసుకువచ్చిందని వార్తలు వెలువడ్డాయి. అయితే చాలా జట్లు ఇప్పటికే తమ శిక్షణా శిబిరాలను ప్రారంభించాయి. చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరం ప్రారంభానికి ముందే ధోని రాబోయే సీజన్ కోసం తన సన్నాహాలను ప్రారంభించాడు. అతడి ప్రాక్టీస్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ 18వ సీజన్ కోసం తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు మహేంద్రసింగ్ ధోని.
Also Read: Neeraj Chopra’s Wife: నీరజ్ చోప్రా భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే.. దిమ్మతిరిగి పోవాల్సిందే!
ధోనీతన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 264 మ్యాచ్ లలో 229 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 39.12 యావరేజ్ తో 5243 పరుగులు చేశాడు. 84 నాటౌట్ హైయెస్ట్ స్కోర్. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2025 కోసం ధోనీని కేవలం నాలుగు కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది అయితే తనకు డబ్బు ముఖ్యం కాదని.. టీమ్ అవసరాలే ముఖ్యమంత్రి ధోని కూడా ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
MS Dhoni started preparations for IPL 2025.
– Thala will be back at the Chepauk. 🚀 pic.twitter.com/lVH1PTFC5b
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 20, 2025